News September 13, 2024

రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

image

TG: ఈ సారి పంట వేసిన రైతులకే రైతు భరోసా అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే పంట బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేశామన్నారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు ఈ నెలాఖరులోపు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా రైతు భరోసా పథకంలో భాగంగా ఎకరాకు రూ.7,500 చొప్పున రెండు విడతల్లో ఏడాదికి రూ.15,000 అందించాల్సి ఉంది.

Similar News

News January 17, 2026

రానున్న 5 రోజులు వర్షాలు

image

TG: రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్షసూచన చేసింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 21 వరకు అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఆస్కారముందని పేర్కొంది. అటు రాష్ట్రంలో నిన్నటి వరకు చలి తీవ్రత తగ్గినట్లు కనిపించగా ఇవాళ పెరిగింది. మరోవైపు ఫిబ్రవరి తొలి వారం నుంచి ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

News January 17, 2026

కొరియన్ బ్యూటీ సీక్రెట్ ఇదే..

image

ప్రస్తుతం ఎక్కడ చూసినా కొరియన్ బ్యూటీ ట్రెండ్ వైరల్ అవుతోంది. కొరియన్లలా కనిపించాలని వారు వాడే ఉత్పత్తులు వాడితే సరిపోదంటున్నారు నిపుణులు. వారి బ్యూటీ సీక్రెట్ ఆరోగ్యకరమైన అలవాట్లే కారణం. మార్నింగ్ స్కిన్‌కేర్ రిచ్యువల్, ప్రోబయోటిక్స్‌ ఆహారాలు, తగిన నిద్ర, నీరు తీసుకోవడం, సన్ స్క్రీన్ ఎక్కువగా వాడటం, ప్రకృతిలో సమయం గడపడం కొరియన్ల అలవాటు. వీటివల్లే వారు అందంగా, ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు.

News January 17, 2026

శ్రీనివాసుడికి శనివారం ఎందుకు ప్రీతికరమైనది?

image

వేంకటేశ్వర స్వామికి శనివారం ప్రీతికరమైన రోజు. ఓంకారం ప్రభవించిన, స్వామివారు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న, ఆలయ ప్రవేశం చేసిన రోజు కూడా శనివారమే. తన భక్తులను పీడించనని శనిదేవుడు శ్రీనివాసుడికి మాట ఇచ్చింది కూడా ఈ రోజే. అందుకే 7 శనివారాలు నియమంతో స్వామిని పూజించి, 7 ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయని నమ్మకం. స్వామివారికి శనివారంతో ఉన్న ఈ అనుబంధం వల్లే భక్తులు శనివారాలు ఉపవాసాలు ఉంటారు.