News June 4, 2024
మంత్రి విడదల రజనీ వెనుకంజ.. తాడికొండ, గురజాలలో భారీ మెజార్టీ దిశగా టీడీపీ
AP: గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి విడదల రజనీ వెనుకంజలో కొనసాగుతున్నారు. టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి 5745 ఓట్ల ముందంజలో ఉన్నారు. గురజాలలో టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాస్ 19వేల ఓట్లు, అమరావతి ప్రాంతమైన తాడికొండలో టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ 18,272 ఓట్ల భారీ ఆధిక్యంలో ఉన్నారు. రేపల్లెలో టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ 6,969 ఓట్ల ముందంజలో ఉన్నారు.
Similar News
News January 3, 2025
భారత్కు బిగ్ షాక్.. ఒకే ఓవర్లో 2 వికెట్లు
టీమ్ ఇండియాకు భారీ షాక్ తగిలింది. బోలాండ్ వేసిన ఓవర్లో రిషభ్ పంత్, నితీశ్ కుమార్ ఔట్ అయ్యారు. ప్రారంభంలోనే కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును జడేజాతో కలిసి పంత్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. పంత్ 40 పరుగులు చేసి ఔట్ కాగా, క్రీజులోకి వచ్చిన నితీశ్ గోల్డెన్ డక్ అయ్యారు. దీంతో టీమ్ఇండియా 120 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.
News January 3, 2025
విజయ నెయ్యి మాత్రమే వాడాలి: ప్రభుత్వం
తెలంగాణలోని అన్ని ఆలయాల్లో ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ నెయ్యి మాత్రమే వాడాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రైవేట్ డైయిరీతో ఒప్పందం చేసుకున్న భద్రాద్రి ఆలయ అధికారులపై చర్యలు తీసుకుంది. అన్ని ఆలయాల్లో నెయ్యి సరఫరాపై నివేదిక ఇవ్వాలని, ఇతర డెయిరీలతో ఒప్పందాలు చేసుకుని ఉంటే రద్దు చేసుకోవాలని సూచించింది. యాదాద్రిలో మాత్రం మార్చి వరకు మదర్ డెయిరీ నెయ్యి వాడేందుకు అనుమతి ఇచ్చింది.
News January 3, 2025
24 గంటల్లో ₹2లక్షలు లాభపడ్డ BITCOIN
కొన్ని రోజులుగా డౌన్ట్రెండులో పయనిస్తున్న బిట్కాయిన్కు మళ్లీ మూమెంటమ్ పెరిగింది. కీలకమైన $92000 సపోర్ట్ లెవల్ నుంచి బలంగా పుంజుకుంది. గత 24 గంటల్లో $2393 (₹2L) లాభపడింది. ప్రస్తుతం $96,940 వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ 1.96% పెరిగి $1.91Tకు చేరుకుంది. ఎథీరియం 2.10% ఎగిసి $3,459 వద్ద చలిస్తోంది. XRP 1.63, SOL 3.67, DOGE 2.71, ADA 2.97, TON 1.41, SLM 4.77, SHIB 3.3, LINK 1.40% మేర ఎగిశాయి.