News October 16, 2024

ఇందిరమ్మ ఇళ్లపై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి

image

TG: హైడ్రాపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహానగర భవిష్యత్తు కోసమే దీనిని తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇప్పటికే రూ.18 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామని, త్వరలోనే రూ.13 వేల కోట్లు చేస్తామన్నారు. ఈ నెలాఖరు నాటికి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి తెలిపారు.

Similar News

News November 23, 2025

తల్లి పాలల్లో యురేనియం ఆనవాళ్లు.. కానీ!

image

ఈ ప్రపంచంలో తల్లి పాలను మించిన పోషకాహారం లేదు. కానీ మారిన వాతావరణ పరిస్థితులతో వాటిలోనూ రసాయనాలు చేరుతున్నాయి. తాజాగా బిహార్ తల్లుల పాలల్లో యురేనియం(5ppb-పార్ట్స్ పర్ బిలియన్) ఆనవాళ్లు గుర్తించినట్లు NDMA సైంటిస్ట్ దినేశ్ వెల్లడించారు. అయితే WHO అనుమతించిన స్థాయికంటే తక్కువగానే ఉన్నాయని, దీనివల్ల ప్రస్తుతానికి ప్రమాదం లేదని చెప్పారు. నీటిలో మాత్రం 6 రెట్లు ఎక్కువగా యురేనియం ఆనవాళ్లు ఉన్నాయన్నారు.

News November 23, 2025

పొల్యూషన్​ నుంచి కాపాడే ఫుడ్స్ ఇవే

image

ప్రస్తుతం వాయుకాలుష్యం పెద్ద సమస్యగా మారింది. లైంగిక పరిపక్వత, హార్మోన్ల అసమతుల్యత వంటి అనేక సమస్యలు వస్తున్నాయి. ఇలా కాకుండా ఉండాలంటే బెర్రీస్, బ్రోకలీ, పసుపు, ఆకుకూరలు, చేపలు ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటు తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్లు కలిగిన విభిన్న ఆహారాలను చేర్చుకోవడం వల్ల కాలుష్యం నుంచి మిమ్మల్ని రక్షించుకోగలుగుతారని చెబుతున్నారు.

News November 23, 2025

స్మృతి మంధాన పెళ్లి వేదిక వద్దకు అంబులెన్స్.. పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్!

image

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ కంపోజర్ పలాశ్ ముచ్చల్ పెళ్లి వేదిక వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. వేడుకలకు హాజరైన అతిథికి గుండెపోటు రావడంతో అంబులెన్స్‌లో సాంగ్లీలోని సర్వ్‌హిత్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి వివరాలు తెలియనప్పటికీ పెళ్లి పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిపై ఈవెంట్ ఆర్గనైజర్లు, కుటుంబ సభ్యులు ఇంకా స్పందించలేదు.