News August 11, 2025
నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు: రాజగోపాల్ రెడ్డి

TG: తనకు మంత్రి పదవి ఇస్తామని మాటివ్వడం నిజమేనంటూ ప్రజలకు చెప్పినందుకు Dy.CM <<17365508>>భట్టి <<>>విక్రమార్కకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేస్తూ అవినీతి రహిత పాలన అందించాలని కోరారు. TG సమాజ ఆకాంక్షలను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉండాలని ఆశిస్తున్నానన్నారు.
Similar News
News August 11, 2025
మినిమమ్ బ్యాలెన్స్ బ్యాంకుల ఇష్టం: RBI

బ్యాంక్ అకౌంట్లో కనీస బ్యాలెన్స్ పరిమితిని రూ.50,000 పెంచుతూ ICICI తీసుకున్న <<17349792>>నిర్ణయంపై <<>>విమర్శలొస్తున్న వేళ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. ‘కనీస సగటు బ్యాలెన్స్ ఎంత ఉండాలి అనేది బ్యాంకుల ఇష్టం. కొన్ని బ్యాంకులు రూ.10,000 ఫిక్స్ చేస్తాయి. మరికొన్ని రూ.2,000 ఉంచుతాయి. మరికొన్ని కనీస బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేశాయి. ఇది ఆర్బీఐ నియంత్రణ పరిధిలోకి రాదు’ అని ఆయన వెల్లడించారు.
News August 11, 2025
షూటింగ్‌లు బంద్ చేయడం సరికాదు: కోమటిరెడ్డి

TG: నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ నేతలతో వేర్వేరుగా భేటీ అయిన అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. షూటింగ్‌లు బంద్ చేయడం సరికాదని, పనిచేస్తూనే డిమాండ్లు నెరవేర్చుకోవాలని కార్మికులకు సూచించారు. నిర్మాతలు కూడా కొంచెం వేతనం పెంచాలని, సమస్యను పెద్దది చేయొద్దని కోరారు. రేపు నిర్మాతలు, కార్మికులు సమావేశమై సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. ఈ భేటీకి ఆయన కూడా హాజరయ్యే అవకాశం ఉంది.
News August 11, 2025
లిక్కర్ స్కాం కేసు.. సిట్ రెండో ఛార్జ్‌షీట్

AP: మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏసీబీ కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. 200 పేజీలతో దీన్ని రూపొందించి, సమర్పించింది. కుంభకోణంలో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల పాత్రలపై ఆధారాలను ఇందులో పొందుపరిచినట్లు తెలుస్తోంది. మద్యం ముడుపులు ఎవరి నుంచి తీసుకున్నారు? ఎవరికి అప్పగించారు? అనే అంశాలను సిట్ పేర్కొన్నట్లు సమాచారం.