News October 8, 2025

హైకోర్టు నుంచి సీఎం ఇంటికి మంత్రులు, ఏజీ

image

TG: BC రిజర్వేషన్ల అంశం హైకోర్టులో తేలకపోవడంతో CM రేవంత్ అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు. హైకోర్టు నుంచి AG, లాయర్లు, మంత్రులను తన నివాసానికి రావాలని సూచించారు. రేపు కోర్టులో వాదనలు, ఎలాంటి తీర్పు ఉండబోతుందనే తదితర అంశాలను చర్చించనున్నారు. అటు విచారణ వాయిదా పడటంతో SEC నోటిఫికేషన్‌పై న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తోంది. మరోవైపు కోర్టు ప్రాంగణంలోనే ఏజీతో మంత్రుల బృందం సమావేశమైంది.

Similar News

News February 18, 2026

EAPCET.. SC విద్యార్థులకు గమనిక..!

image

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలులో భాగంగా ఈసారి EAPCET ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే ఎస్సీ విద్యార్థులు గ్రూప్ 1, 2, 3 ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని కన్వీనర్ విజయ్ కుమార్‌రెడ్డి సూచించారు. మిగతా విభాగాలకు చెందిన విద్యార్థులు యథావిధిగా దరఖాస్తులు సమర్పించాలన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషలలో ప్రవేశ పరీక్ష ఉంటుందని అన్నారు.

News February 18, 2026

అకౌంట్లలోకి డబ్బులు.. ఎప్పుడంటే?

image

PM కిసాన్ కింద 22వ విడత నిధులకు సమయం ఆసన్నమైంది. ఈ నెల 22న కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.2,000 చొప్పున జమ చేయాలని భావిస్తోంది. అయితే తేదీపై ప్రకటన రావాల్సి ఉంది. ఆ రోజు కుదరకపోతే ఈ నెల చివరిలోగా డబ్బులు జమ చేయాలని యోచిస్తోంది. PM కిసాన్ కింద కేంద్రం ఏటా మూడు విడతలుగా రూ.6,000 అందిస్తోంది. లబ్ధి పొందేందుకు ఇప్పటివరకు <>ఈ-కేవైసీ<<>> చేయనివారు వెబ్‌సైట్‌లోకి వెళ్లి పూర్తి చేయండి.

News February 18, 2026

పిల్లలకు డబ్బాపాలు పడుతున్నారా?

image

డబ్బా పాలు పట్టే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. * అత్యవసరం అయితే తప్పా డబ్బా పాలు పట్టకూడదు. సీసాలో ఇస్తున్నప్పుడు గ్యాప్ తీసుకుంటూ ఇవ్వాలి. డబ్బా పాలే కదా అని పడుకోబెట్టి ఇవ్వకూడదు. * నెలలు నిండని పిల్లల్లో అవయవాలు ఎదగక కూడా పాలు పట్టినప్పుడు జీర్ణాశయంలోకి సాఫీగా వెళ్లక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. శిశువుల ఎదుగుదలను బట్టి, వారి వయసుకు అనుగుణంగా వైద్యుడి సలహా మేరకు మాత్రమే పాలు పట్టాలి.