News June 4, 2024
మంత్రులు అమర్నాథ్, బొత్స వెనుకంజ

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంత్రులు అమర్నాథ్, బొత్స సత్యనారాయణకు షాకిస్తున్నాయి. గాజువాకలో మంత్రి అమర్నాథ్పై టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు 21,812 ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు. అటు చీపురుపల్లిలో మంత్రి బొత్సపై టీడీపీ అభ్యర్థి కళా వెంకట్రావు 2,463 ఓట్ల మెజార్టీలో ఉన్నారు. ఆముదాలవలసలో స్పీకర్ తమ్మినేని సీతారాంపై TDP అభ్యర్థి కూన రవికుమార్ 14,919 ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు.
Similar News
News November 26, 2025
బాలిస్టిక్ క్షిపణి పరీక్షించిన పాకిస్థాన్

యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పాకిస్థాన్ మిలిటరీ ప్రకటించింది. ‘స్థానికంగా నిర్మించిన నేవల్ ప్లాట్ఫామ్ నుంచి మిస్సైల్ పరీక్షించాం. సముద్రం, భూమిపై ఉన్న లక్ష్యాలను ఇది అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. ఇందులో అత్యాధునిక గైడెన్స్ వ్యవస్థలు ఉన్నాయి’ అని పేర్కొంది. కాగా మే నెలలో భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాతి నుంచి పాకిస్థాన్ ఈ తరహా ప్రయోగాలను పెంచింది.
News November 26, 2025
పుల్లోరం వ్యాధితో కోళ్లకు ప్రమాదం

వైరస్, సూక్ష్మజీవుల వల్ల కోళ్లలో పుల్లోరం వ్యాధి సోకుతుంది. కోడి పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువ. తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. రోగం సోకిన కోడిపిల్లలు గుంపులుగా గుమికూడటం, శ్వాసలో ఇబ్బంది, రెక్కలు వాల్చడం, మలద్వారం వద్ద తెల్లని రెట్ట అంటుకోవడం వంటి లక్షణాలుంటాయి. కోడిని కోసి చూస్తే గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు వెటర్నరీ డాక్టర్ సలహాలను పాటించాలి.
News November 26, 2025
రాజ్యాంగ రూపకల్పనలో అతివలు

భారత రాజ్యాంగాన్ని లిఖితపూర్వకంగా, క్రమ పద్ధతిలో ఒక గ్రంథంగా రూపొందించారు. దీన్ని భారత రాజ్యాంగ పరిషత్ 1946, డిసెంబరు 9 నుంచి 1949, నవంబరు 26 వరకు అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలంలో రూపొందించింది. దీంట్లో గౌరీ భంజా చోళ కాంస్య నటరాజ విగ్రహ రూపాన్ని రాజ్యాంగంలో చిత్రీకరించారు. అలాగే జమునా సేన్, నిబేదిత బోస్, అమలా సర్కార్, బాని పటేల్ కూడా రాజ్యాంగంలోని పలు ఇల్యుస్ట్రేషన్లు చిత్రీకరించారు.


