News November 16, 2024
మంత్రి హామీ.. RTC ఉద్యోగుల ధర్నాలు వాయిదా
AP: ఈ నెల 19, 20 తేదీల్లో చేపట్టాల్సిన నిరసనలను ఎంప్లాయీస్ యూనియన్ వాయిదా వేసుకుంది. RTC ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇచ్చిన హామీతో ధర్నాలను వాయిదా వేస్తున్నట్లు EU పేర్కొంది. RTC ఉద్యోగుల అన్ని ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి ఈ సందర్భంగా ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదరరావుతో ఫోన్లో మాట్లాడారు.
Similar News
News November 17, 2024
BGT ఆ జట్టే గెలుస్తుంది: హేడెన్
ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే BGT సిరీస్‌ను 3-1 తేడాతో ఆస్ట్రేలియా గెలుస్తుందని ఆ జట్టు మాజీ ప్లేయర్ మాథ్యూ హేడెన్ జోస్యం చెప్పారు. కోహ్లీ, స్మిత్ వారి జట్లకు కీలకంగా మారతారని చెప్పారు. కమిన్స్, బుమ్రా బౌలింగ్ సిరీస్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడ్డారు. కాగా ఆస్ట్రేలియాలో ఆడిన చివరి రెండు సిరీస్‌లను భారత్ గెలుచుకోవడం గమనార్హం.
News November 17, 2024
మంచి వాళ్లంటే ధనుష్‌కు ఇష్టం ఉండదు: నయనతార భర్త
అందరూ అనుకుంటున్నట్లు హీరో ధనుష్ అంత మంచివాడు కాదని హీరోయిన్ నయనతార భర్త, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ అన్నారు. ఆయనకు మంచి వాళ్లంటే ఇష్టం ఉండదని చెప్పారు. ‘నయనతారకు లీగల్ నోటీసులు పంపడం దుర్మార్గం. సాటి మనిషిగా ధనుష్ చేసింది ముమ్మాటికీ తప్పే. అభిమానులు ఆయన అసలు ముఖం ఏంటో తెలుసుకోవాలి’ అని ఆయన ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేశారు.
News November 17, 2024
చంద్రబాబును పరామర్శించిన రాహుల్ గాంధీ
AP: సీఎం చంద్రబాబును ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఫోన్లో పరామర్శించారు. సీఎం సోదరుడి మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. చంద్రబాబు కుటుంబానికి రాహుల్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ధైర్యంగా ఉండాలని ఆయన భరోసా ఇచ్చారు.