News January 3, 2025
తల్లికి వందనం అమలుపై మంత్రి క్లారిటీ

AP: ఈ ఏడాది జూన్ 15లోగా తల్లికి వందనం స్కీమ్‌ను అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. సూపర్ సిక్స్ పథకాలపై వైసీపీ రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో వేర్‌హౌస్ కార్పొరేషన్ గిడ్డంగులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఏటా రూ.15,000 చొప్పున అందిస్తామని కూటమి నేతలు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
Similar News
News December 14, 2025
విమాన వేంకటేశ్వర స్వామి ఎక్కడ ఉంటారు?

విమాన వేంకటేశ్వర స్వామి వారు శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయ గోపురం దక్షిణ భాగంలో దర్శనమిస్తారు. ఈ మూర్తి ఆలయ మూలవిరాట్టులాగే ఉంటుంది. శ్రీవారి భక్తుడైన తొండమాన్ చక్రవర్తి దీనిని ఏర్పాటు చేశారని వేంకటాచల మాహాత్మ్యం చెబుతోంది. భక్తులు సులభంగా దర్శించుకునేందుకు వీలుగా గోపురం వద్ద వెండి మకర తోరణం ఏర్పాటు చేశారు. అలాగే బాణం గుర్తు కూడా ఉంటుంది. ఈ స్వామివారిని దర్శించడం విశేషంగా భావిస్తారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News December 14, 2025
అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

AP: అనకాపల్లి సమీపంలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(BARC)ను ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 3వేల ఎకరాల్లో ఈ కేంద్రం ఏర్పాటుకానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే సేకరించిన భూమిని ఆనుకొని ఉన్న 148.15 హెక్టార్ల రెవెన్యూ భూమిని తమకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రక్షణపరంగా విశాఖ తీరం ఈ సెంటర్ ఏర్పాటుకు అనువైనదిగా భావించి కేంద్ర ప్రభుత్వం ఈ ఏరియాను ఎంపిక చేసింది.
News December 14, 2025
యూదులే లక్ష్యంగా టెర్రర్ దాడి?

ఆస్ట్రేలియా బీచ్‌లో <<18561798>>కాల్పులు<<>> యూదులే లక్ష్యంగా జరిపినట్లుగా తెలుస్తోంది. ఇవాళ్టి నుంచి 8 రోజులపాటు యూదులు ‘చనుకా(హనుక్కా)’ పండుగ జరుపుకుంటారు. రాత్రి పూట కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఇందుకోసం సిడ్నీలోని బాండీ బీచ్‌కు చేరుకున్న 2 వేల మందిపై ఇద్దరు గన్‌మెన్లు ఫైరింగ్ జరిపారు. ఇది యూదులపై ఉగ్రవాదులు జరిపిన నీచమైన దాడి అని ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఐజాక్ హెర్జోగ్ మండిపడ్డారు.


