News December 22, 2024

అల్లు అర్జున్‌ ప్రెస్‌మీట్‌పై మంత్రి కామెంట్స్

image

TG: ప్రెస్‌మీట్‌లో అల్లు అర్జున్ కామెంట్స్ సీఎంను అగౌరవపరిచే విధంగా ఉన్నాయని, వాటిని వెనక్కి తీసుకోవాలని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. పర్మిషన్ లేకుండా ఆయన థియేటర్‌కు వచ్చారని, తమ వద్ద అన్ని ఆధారాలున్నాయని చెప్పారు. ఈ ఘటనను రాజకీయం చేయొద్దని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, సినీ ఇండస్ట్రీ మధ్య గ్యాప్ లేదని మంత్రి స్పష్టం చేశారు.

Similar News

News February 3, 2026

రూ.21వేలతో రూ.20 లక్షలంటూ ప్రచారం.. క్లారిటీ

image

కేంద్ర మంత్రి నిర్మల ఓ ఇన్వెస్ట్‌మెంట్ ప్రాజెక్టును ప్రోత్సహిస్తున్నారంటూ SMలో ప్రచారం జరుగుతోంది. కేవలం రూ.21వేలు పెట్టుబడి పెడితే 3 రోజుల్లోనే రూ.20లక్షలు వస్తాయంటూ కొందరు పోస్టులు చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని PIB Fact Check ఖండించింది. కేంద్ర ఆర్థిక మంత్రి/భారత ప్రభుత్వం ఇలాంటి పెట్టుబడి పథకాన్ని ఆమోదించలేదని స్పష్టం చేసింది. మోసగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది.

News February 3, 2026

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమదే: నిర్మలా సీతారామన్

image

అంతర్జాతీయంగా ఏర్పడిన అనిశ్చితి వల్లే గోల్డ్ ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయని ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. పలు సెంట్రల్ బ్యాంకులు గోల్డ్‌లో పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. ఏ దేశ కరెన్సీపైనా ఇన్వెస్టర్లకు నమ్మకం లేక బంగారం వైపు మొగ్గుచూపుతున్నారని చెప్పారు. స్పెక్యులేటివ్ డెరివేటివ్ ట్రేడింగ్ జోలికి సామాన్యులు వెళ్లకూడదనే ఎఫ్‌&వోపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంచామన్నారు.

News February 3, 2026

మహిళలూ.. ఈ లక్షణాలున్నాయా? జాగ్రత్త

image

క్యాన్సర్ లక్షణాలు అన్నిసార్లూ బయటకు కనిపించవు. ముఖ్యంగా మహిళల్లో కొన్ని క్యాన్సర్లు నిశ్శబ్ధంగా శరీరంలో వ్యాపిస్తాయంటున్నారు నిపుణులు. చాలా క్యాన్సర్లను ప్రారంభదశలో గుర్తించడం కష్టమని చెబుతున్నారు. అందుకే మహిళల్లో అసాధారణ వాపు, దీర్ఘకాల అలసట, కారణం లేకుండా బరువు తగ్గడం, చర్మంపై మార్పులు, అసాధారణ రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.