News August 17, 2024

రూ.2లక్షలకు పైనున్న రుణాలపై మంత్రి కీలక ప్రకటన

image

TG: రూ.2లక్షలకు పైగా రుణాలు తీసుకున్న రైతులు రూ.2 లక్షలు పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేయాలని మంత్రి తుమ్మల సూచించారు. ఆ తర్వాత రూ.2 లక్షల రుణమాఫీ పథకాన్ని వర్తింపచేస్తామని తెలిపారు. రూ.2 లక్షల్లోపు రుణాలన్నింటిని మాఫీ చేసినట్లు పేర్కొన్నారు. అర్హులై ఉండి రుణమాఫీ కాని వారు వ్యవసాయాధికారులను సంప్రదించాలని సూచించారు.

Similar News

News December 13, 2025

మోగ్లీ మూవీ రివ్యూ&రేటింగ్

image

ప్రేమించిన యువతి కోసం క్రిమినల్ పోలీ‌స్‌తో హీరో చేసే పోరాటమే మూవీ కథ. రోషన్ యాక్టింగ్, బధిర యువతిగా హీరోయిన్, బండి సరోజ్ నటన మెప్పిస్తాయి. వైవా హర్ష కామెడీ నవ్వులు పూయిస్తుంది. మ్యూజిక్ ఫర్వాలేదు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌ లవ్‌స్టోరీ రొటీన్‌గా అనిపిస్తుంది. సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపించవు. ఎమోషనల్ కనెక్షన్ మిస్ అవుతుంది. కర్మ సిద్ధాంతంతో లింక్ పెట్టి సందీప్ రాజ్ కథ అల్లారు.
రేటింగ్:2.25/5

News December 13, 2025

వారితో కేరళ విసిగిపోయింది: మోదీ

image

తిరువనంతపురం కార్పొరేషన్‌లో NDA <<18552178>>గెలవడం<<>>పై ప్రధాని మోదీ స్పందించారు. ‘థాంక్యూ తిరువనంతపురం. ఈ గెలుపు కేరళ రాజకీయాల్లో కీలక మలుపు. రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షలను మా పార్టీ మాత్రమే తీర్చగలదని ప్రజలు నిశ్చయించుకున్నారు. UDF, LDFతో కేరళ విసిగిపోయింది. వికసిత్ కేరళకు, సుపరిపాలనకు మరో ఆప్షన్‌గా ఎన్డీయేను ప్రజలు చూస్తున్నారు’ అని పలు ట్వీట్లు చేశారు. BJP-NDAకు ఓటు వేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

News December 13, 2025

TGCABలో ఇంటర్న్‌‌గా చేరాలనుకుంటున్నారా?

image

తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఎపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (<>TGCAB<<>>) HYD 7 ఇంటర్న్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. MBA/మార్కెటింగ్ మేనేజ్‌మెంట్/కోఆపరేటివ్ మేనేజ్‌మెంట్/అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్/రూరల్ డెవలప్‌మెంట్‌ మేనేజ్‌మెంట్ అర్హతగల వారు DEC 23 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 21ఏళ్లు. ఎంపికైనవారికి నెలకు రూ.25వేలు చెల్లిస్తారు. విద్యార్హత, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. tgcab.bank.in