News August 10, 2024

‘రైతు భరోసా’పై మంత్రి కీలక వ్యాఖ్యలు

image

TG: నిజంగా పంట పండించే రైతులకు ‘రైతు భరోసా’ అందాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు తాము చేయబోమని రైతులతో సమావేశంలో చెప్పారు. రైతుల నుంచి అభిప్రాయ సేకరణ పూర్తయిన వెంటనే అర్హులైన వారి ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ చేస్తామని పేర్కొన్నారు. కాగా ఎకరాకు రూ.15వేల చొప్పున ప్రభుత్వం రైతులకు ఇవ్వనుంది.

Similar News

News March 23, 2026

పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలు ఒప్పుకోలేదు: టీమ్

image

పవన్ కళ్యాణ్ కొత్తగా ఎలాంటి సినిమాలు ఒప్పుకోలేదని ఆయన ప్రొడక్షన్ టీమ్ ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ వెల్లడించింది. కొత్త ప్రాజెక్టుల గురించి జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి కొత్త సినిమాలు ప్రారంభించే ప్లాన్ లేదని, ఏదైనా ఉంటే అఫీషియల్‌గా ప్రకటిస్తామని తెలిపింది. ‘OG-2’ సినిమా గురించి ఆయనే సరైన సమయంలో ప్రకటన చేస్తారని పేర్కొంది.

News March 23, 2026

యుద్ధంపై 3 ముక్కలాట.. అసలేం జరుగుతోంది?

image

యుద్ధంపై అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ చేస్తున్న ప్రకటనలు గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఇరాన్‌తో చర్చలు సఫలమయ్యాయని, 5 రోజులు <<19457337>>దాడులు నిలిపేస్తామని<<>> తొలుత ట్రంప్ ప్రకటించారు. కానీ USతో తాము <<19457474>>సంప్రదింపులే<<>> జరపలేదని ఇరాన్ తెలిపింది. దీంతో నిన్న రాత్రే చర్చించామని, 5రోజుల్లో డీల్ కుదరొచ్చని ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. ఇంతలోనే టెహ్రాన్‌పై దాడులు ప్రారంభించామని ఇజ్రాయెల్ చెప్పడం కన్ఫ్యూజన్‌ను ఇంకా పెంచింది.