News September 12, 2024
హెల్త్ కార్డుల తయారీపై మంత్రి కీలక ఆదేశాలు

TG: హెల్త్ ప్రొఫైల్, హెల్త్ కార్డుల్లోని సమాచారం ప్రజలకు సకాలంలో వైద్యం అందించేందుకు సాయపడేలా ఉండాలని అధికారులను మంత్రి రాజనర్సింహ ఆదేశించారు. మొదట వ్యక్తుల పేరు, అడ్రస్, వృత్తి వంటి ప్రాథమిక సమాచారం సేకరించాలని, ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు, అనారోగ్య కారక అలవాట్లు వంటివి నమోదు చేయాలన్నారు. యూనిక్ నంబర్, బార్ కోడ్, ఫొటోతో హెల్త్ కార్డులను తయారు చేయాలని సూచించారు.
Similar News
News December 5, 2025
ఈ వ్యాధితో జాగ్రత్త: సత్యసాయి జిల్లా కలెక్టర్

శ్రీ సత్యసాయి జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతున్న సందర్భంగా ప్రజలు అత్యంత జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో సూచించారు. ఈ వ్యాధి చిగర్ మైట్స్ అనే సూక్ష్మ పురుగుల కాటుతో వ్యాపిస్తుందని, ప్రారంభ దశలోనే వైద్య చికిత్స పొందితే పూర్తిగా నయం అవుతుందని తెలిపారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి ప్రారంభదశలో గుర్తిస్తే సులభంగా నయం చేసుకోవచ్చన్నారు.
News December 5, 2025
టిఫా స్కాన్లో ఏం చెక్ చేస్తారంటే?

టిఫా అంటే.. టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫ్యూటల్ ఎనామిలీస్. నిపుణులైన రేడియాలజిస్టులు ఈ స్కాన్ చేస్తారు. గర్భంలోని శిశువు తల నుంచి కాలిబొటన వేలు వరకు ప్రతి అవయవాన్ని స్కాన్ చేస్తారు. శిశువు, ప్లాసెంటా పొజిషన్, ఉమ్మనీరు స్థితి గుర్తిస్తారు. అలాగే తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని బట్టి ప్రసవం ఎలా చెయ్యాలి అనేది కూడా ఈ స్కాన్ ద్వారా నిర్ణయిస్తారు. కాబట్టి ఈ స్కాన్ కచ్చితంగా చేయించుకోవాలంటున్నారు నిపుణులు.
News December 5, 2025
ఇంట్లో పూజ ఎవరు చేయాలి?

ప్రతి ఇంట్లో దాదాపు మహిళలే పూజలు చేస్తుంటారు. కానీ సంకల్ప శ్లోకాలు “ధర్మపత్ని సమేతస్య” అని చెబుతాయి. అంటే భార్య సమేతంగా భర్తే పూజలో ప్రధానం అని అర్థం. భర్త క్షేమం కోసం భార్య చేసే పూజలు మినహా నిత్య పూజలు, ఇతర వ్రతాలను ఇద్దరు కలిసి చేస్తేనే అత్యుత్తమ ఫలితం ఉంటుందంటున్నారు పండితులు. దీపం వెలిగించడం, సంకల్పం చేయడం, ప్రధాన పూజాచర్యలు నిర్వహించాల్సిన బాధ్యత భర్తదే అని చెబుతున్నారు.


