News July 31, 2024
ఫ్రాన్స్ అధ్యక్షుడికి మంత్రి ముద్దు.. దుమారం!

పారిస్ ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీ సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ను ఆ దేశ క్రీడలమంత్రి ఉడియా కాస్టేరా కౌగిలించుకుని గాఢంగా ముద్దు పెట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో దుమారం చెలరేగింది. ‘ఒక అధ్యక్షుడు, మంత్రి చేయాల్సిన పని కాదు’ అని నెటిజన్లు మండిపడుతున్నారు. ‘అలా ముద్దు పెట్టుకునేది ప్రేమికులు మాత్రమే’ అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
Similar News
News October 31, 2025
BREAKING: భారత్ ఓటమి

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమ్ ఇండియా ఓటమి పాలైంది. భారత్ నిర్దేశించిన 126 పరుగుల టార్గెట్ను 6 వికెట్లు కోల్పోయి 13.2 ఓవర్లలోనే ఆసీస్ ఛేదించింది. మార్ష్ 46, ట్రావిస్ హెడ్ 28, ఇంగ్లిస్ 20 పరుగులతో రాణించారు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, బుమ్రా తలో 2 వికెట్లు తీశారు. మొదటి టీ20 రద్దవ్వగా.. మూడో టీ20 నవంబర్ 2న జరగనుంది.
News October 31, 2025
3 రాష్ట్రాల్లో పోటీ.. ఓ గెలుపు.. తొలిసారి మంత్రి

TG: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, <<18158294>>మంత్రి అజహరుద్దీన్<<>> పొలిటికల్ జర్నీ 3 రాష్ట్రాల మీదుగా సాగింది. 2009లో INCలో చేరిన ఆయన మొరదాబాద్(UP) ఎంపీగా గెలిచారు. 2014లో టోంక్ సవాయూ మాధోపుర్(రాజస్థాన్) లోక్సభ స్థానంలో ఓడిపోయారు. 2019లో టికెట్ దక్కలేదు. 2023లో సొంతరాష్ట్రం తెలంగాణలోని జూబ్లీహిల్స్ MLAగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ప్రత్యేక రాజకీయ పరిస్థితుల మధ్య ఇవాళ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
News October 31, 2025
RITESలో 600 పోస్టులు.. అప్లై చేశారా?

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(RITES)లో 600 సీనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. బీఎస్సీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు నవంబర్ 12వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.300, SC,ST, PWBDలకు రూ.100. వెబ్సైట్: https://www.rites.com


