News January 26, 2025
జనసేన కార్యకర్తలకు మంత్రి వార్నింగ్

AP: కూటమి మధ్య విభేదాలు సృష్టించేలా జరుగుతున్న ప్రచారంపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఘాటుగా స్పందించారు. కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తామెప్పుడూ సమస్యలపైనే పోరాటం చేశామని తెలిపారు. పదవుల కోసం టైమ్ వేస్ట్ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని జనసేన కార్యకర్తలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. పార్టీ సిద్ధాంతం కోసమే అందరూ నిలబడాలని, రహస్యంగా లేఖలు, సమావేశాలు వద్దని సూచించారు.
Similar News
News November 22, 2025
బెంగళూరు ట్రాఫిక్ కంటే అంతరిక్ష ప్రయాణమే సులువు: శుభాంశు

భారత వ్యోమగామి శుభాంశు శుక్లాకు బెంగళూరు ట్రాఫిక్ చిరాకు తెప్పించింది. టెక్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన అక్కడి ట్రాఫిక్ కష్టాలపై చమత్కరించారు. ‘బెంగళూరులోని ఈ ట్రాఫిక్‌ను దాటడం కంటే అంతరిక్షంలో ప్రయాణించడం చాలా సులువు’ అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ‘మారతహళ్లి నుంచి ఈవెంట్‌కు రావడానికి ప్రసంగానికి కేటాయించిన సమయం కంటే మూడు రెట్లు ఎక్కువ పట్టింది’ అని నవ్వుతూ నగర ప్రజల బాధను హైలైట్ చేశారు.
News November 22, 2025
‘పండ్లు, కూరగాయల సాగుతో ఎక్కువ లాభం’

నారింజ పంట ఉత్పత్తికి నాణ్యమైన విత్తనాల కోసం నాగ్‌పూర్‌లో రూ.70 కోట్లతో క్లీన్‌ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. భూసార పరీక్షలు, నాణ్యమైన విత్తనాలను అందజేయడంపై ICAR సైంటిస్టులు దృష్టిపెట్టాలన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలంటే పండ్లు, కూరగాయ పంటలను సాగు చేయాలని.. యంత్రాలు, డ్రిప్ ఇరిగేషన్ వాడకంపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు.
News November 22, 2025
ఇంగ్లండ్ ఆలౌట్.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే?

యాషెస్ సిరీస్ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 164 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇంగ్లిష్ బ్యాటర్లను తక్కువ స్కోర్‌కే కట్టడి చేయడంలో ఆస్ట్రేలియా బౌలర్లు సక్సెస్ అయ్యారు. పోప్(33), డకెట్(28), జేమీ స్మిత్(15), అట్కిన్సన్(37), కార్స్(20) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ 4, స్టార్క్, డగ్గెట్ చెరో 3 వికెట్లు తీశారు. విజయం కోసం ఆస్ట్రేలియా 205 పరుగులు చేయాల్సి ఉంటుంది.


