News June 20, 2024
బాధ్యతలు చేపట్టిన మంత్రులు

AP: సచివాలయంలో మంత్రులు బాధ్యతలు చేపట్టారు. జలవనరుల శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు, కార్మికశాఖ మంత్రిగా వాసంశెట్టి సుభాష్, పరిశ్రమల శాఖ మంత్రిగా TG భరత్ తమ ఛాంబర్లలో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు చేపట్టారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి పోలవరాన్ని పరుగులు పెట్టిస్తామని నిమ్మల అన్నారు. YCP వల్లే పోలవరం ఆలస్యమైందని దుయ్యబట్టారు. కార్మిక చట్టాలను జగన్ ప్రభుత్వం కాలరాసిందని వాసంశెట్టి ఫైర్ అయ్యారు.
Similar News
News March 29, 2026
ప్రభుత్వ ఉద్యోగుల జవాబుదారీతనం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

TG: ‘ఉద్యోగుల జవాబుదారీతనం, తల్లిదండ్రుల పోషణ పర్యవేక్షణ బిల్లు-2026’కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగి వేతనంలో ప్రభుత్వం 15% కోత విధిస్తుంది. ఆ నగదును తల్లిదండ్రుల ఖాతాలో జమ చేస్తుంది. ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులకూ ఇది వర్తిస్తుంది. పేరెంట్స్‌ను పట్టించుకోని వారికి ఇది గుణపాఠం అని, అలాంటి వారిని సామాజిక బహిష్కరణ చేయాలని CM రేవంత్ వ్యాఖ్యానించారు.
News March 29, 2026
‘అగ్ర తాంబూలం’ ఇవ్వడం అంటే?

ఏవైనా కార్యక్రమాలు, ప్రాజెక్టుల్లో ఓ వ్యక్తికి లేదా వర్గాలకు అధిక ప్రాధాన్యం, గౌరవం ఇస్తున్నారని చెప్పే సందర్భంలో ‘అగ్ర తాంబూలం’ జాతీయాన్ని వాడతారు. మహాభారతంలో ధర్మరాజు రాజసూయ యాగం చేశారు. చివరలో శ్రీకృష్ణుడికి మొదటి తాంబూలం ఇచ్చి గౌరవించారు. ఆ ఘట్టం నుంచే అగ్ర తాంబూలం వాడుకలోకి వచ్చిందని భాషా నిపుణులు చెబుతుంటారు. ప్రతి వేడుకలోనూ ఆకువక్కలతో తాంబూలం ఇవ్వడం అందరికీ తెలిసిందే.
<<-se>>#EPICSAYINGS<<>>
News March 29, 2026
KCR అందుకే అసెంబ్లీకి రావడం లేదు: రేవంత్

TG: BRS అధినేత KCR దళితులను చిన్నచూపు చూస్తారని, కనువిప్పు కలగాలనే ఎస్సీని స్పీకర్ చేసినట్లు CM రేవంత్ చెప్పారు. దళితుడిని మైక్ కావాలని కోరాల్సి వస్తుందని KCR సభకు రావట్లేదని ధ్వజమెత్తారు. దొర బిడ్డనై ఉండి దళితుడి ముందు కింద కూర్చోవాలా? అనే అహంకారంతోనే రావట్లేదని ఆరోపించారు. అహంకారమో, వయసు మీద పడిందని ఆయన్ను కొన్ని విషయాల్లో వదిలేసినా సభకు వచ్చిన BRS నేతల తీరు సరిగా లేదని CM మండిపడ్డారు.


