News October 25, 2025

అయోధ్య దర్శన వేళల్లో స్వల్ప మార్పులు

image

అయోధ్య బాల రాముడి ఆలయంలో దర్శన సమయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకపై రాత్రి 8.30గం. వరకే దర్శనానికి అనుమతించనున్నారు. శీతాకాలం దృష్ట్యా అరగంట కుదించామని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టీ అనిల్ మిశ్రా తెలిపారు. మంగళహారతిని తెల్లవారుజామున 4గం.కు బదులు 4.30కి, శృంగార హారతిని 6కు బదులుగా 6.30గం.కు, శయన హారతిని రాత్రి 10గం.కు బదులు 9.30కి నిర్వహిస్తారు. దర్శనాలు యథావిధిగా ఉదయం 7 గం.కు మొదలవుతాయి.

Similar News

News October 25, 2025

కీళ్ల నొప్పులు మహిళలకే ఎందుకు ఎక్కువ?

image

పురుషులతో పోలిస్తే మహిళల్లోనే కీళ్ల సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి జన్యుపరంగానే కాకుండా జీవనశైలి కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. ‘రుతుస్రావం, గర్భం, మెనోపాజ్ సమయాల్లో ఈస్ట్రోజెన్ స్థాయిలలో మార్పులు ఆర్థరైటిస్ లక్షణాలను ప్రభావితం చేస్తాయి. అలాగే బరువు పెరగడం, ఇంటి పనులు, శారీరక, మానసిక సమస్యలు కూడా కీళ్లపై ప్రభావం చూపుతాయి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి’ అని పేర్కొంటున్నారు.

News October 25, 2025

ఆర్థరైటిస్ ఎలా నివారించాలి?

image

మహిళల్లో కీళ్ల నొప్పులను(ఆర్థరైటిస్) నివారించడానికి క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేస్తూ బరువు, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. నడక, ఈత, సైక్లింగ్ వంటివి కండరాలను బలోపేతం చేస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉండే చేపలు, అవిసె గింజలు, వాల్‌నట్‌, ఆలివ్ ఆయిల్ వంటి ఆహారాలు తీసుకోవాలి. అవి వాపును తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే పండ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్లు అధికంగా తీసుకోవాలి.

News October 25, 2025

పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,250 పెరిగి ₹1,25,620కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,150 ఎగిసి ₹1,15,150గా ఉంది. అటు KG వెండి ధర రూ.1,70,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.