News January 9, 2025
ఇచ్ఛాపురంలో స్వల్ప భూ ప్రకంపనలు
AP: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. బుధవారం రాత్రి 10:56 గంటలకు 2 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయని స్థానికులు తెలిపారు. అలాగే గురువారం తెల్లవారుజామున 4:55 గంటల సమయంలో మరోసారి స్వల్పంగా భూమి కంపించిందని తెలిపారు. దీంతో ఇచ్ఛాపురం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెండేళ్ల క్రితం అక్టోబరులోనూ ఇలాగే భూ ప్రకంపనలు వచ్చాయని చెబుతున్నారు.
Similar News
News January 9, 2025
పవర్ఫుల్ పాస్పోర్ట్స్: ఇండియా ర్యాంక్ ఇదే!
ప్రపంచంలోని శక్తిమంతమైన పాస్పోర్ట్ల జాబితాలో భారత్ 5 స్థానాలు దిగజారింది. 80 నుంచి 85వ స్థానానికి పడిపోయింది. వీసా రహితంగా ట్రావెల్ చేయగలిగిన గమ్యస్థానాల సంఖ్య ఆధారంగా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 ఈ ర్యాంకింగ్స్ ఇచ్చింది. భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లు 57 గమ్యస్థానాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. సింగపూర్ శక్తిమంతమైన పాస్పోర్ట్ (195 గమ్యస్థానాలకు వీసా ఫ్రీ)గా నిలిచింది.
News January 9, 2025
అవినీతి ఎక్కడ జరిగింది?: KTR
TG: తనపై పెట్టింది రాజకీయ కక్షపూరిత కేసు అని KTR మరోసారి చెప్పారు. ‘నేను పైసలు పంపాను. డబ్బులు వచ్చాయని వాళ్లు చెబుతున్నారు. ఇందులో అవినీతికి ఆస్కారం ఎక్కడ ఉంది? ఇదే విషయం అధికారులను అడిగాను. అసంబద్ధ కేసులో నన్ను ఎందుకు విచారిస్తున్నారని అధికారులను ప్రశ్నించా. విచారణకు ఫార్ములా సంస్థను ఎందుకు పిలవలేదని అడిగా. ACB అధికారుల నుంచి సమాధానం లేదు’ అని ఆయన ఆరోపించారు.
News January 9, 2025
బూడిదైన అమెరికా అధ్యక్షుడి కొడుకు భవనం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తనయుడు హంటర్ బైడెన్కు చెందిన 75 ఏళ్ల ఇల్లు లాస్ ఏంజెలిస్ కార్చిచ్చులో కాలి బూడిదైంది. 3 పడకగదులతో కూడిన ఆ ఇంటితో పాటు ఇంటి ముందు నిలిపి ఉన్న కారు కూడా బూడిదకుప్పలా మారినట్లు సమాచారం. ఈ ఇంటిని 1950లో నిర్మించినట్లు తెలుస్తోంది. కాగా, కార్చిచ్చులో ఇప్పటి వరకు 2 వేల ఇళ్లు కాలినట్లు అంచనా. ఏకంగా 50 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు.