News July 9, 2024
బీజేపీకి వ్యతిరేకంగా మైనారిటీలు ఏకం కావాలి: భట్టి

TG: మైనారిటీలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని నేషనల్ సాలిడారిటీ కమిటీ ఏర్పాటు సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా మైనారిటీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ‘YSR హయాంలో ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లను కల్పించాం. ఆయన అందరికీ స్ఫూర్తి ప్రదాత. ప్రపంచపటంలో హైదరాబాద్ ఉందంటే అందుకు వైఎస్ చేపట్టిన కార్యక్రమాలే కారణం. మరో 2 దశాబ్దాలపాటు కాంగ్రెస్‌దే అధికారం’ అని స్పష్టం చేశారు.
Similar News
News January 26, 2026
ఫోన్ ట్యాపింగ్ కేసు.. సంతోష్‌రావుకు సిట్ నోటీసులు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో BRS మాజీ ఎంపీ సంతోష్‌రావుకు సిట్ నోటీసులిచ్చింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు HYD జూబ్లీహిల్స్‌లోని పీఎస్‌లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇటీవల బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, కేటీఆర్‌లను సిట్ విచారించిన విషయం తెలిసిందే. అటు రేపటి విచారణకు హాజరై, సిట్ ప్రశ్నలకు సమాధానం చెబుతానని సంతోష్‌రావు తెలిపారు.
News January 26, 2026
కట్టె జనుము పంటకు ఈ దశలో నీటి తడులు తప్పనిసరి

వరి మాగాణిలో కట్టె జనుము పంటను సాగు చేస్తే మొదటి తడి అవసరం లేకుండా విత్తనాలు మొలకెత్తుతాయి. అయితే పంట మొలిచాక తొలి దశలో అనగా 25 రోజులకు, పూత, విత్తనం ఏర్పడే దశలో పంటను నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. అవసరాన్ని బట్టి పంట కాలంలో రెండు నుంచి 3 నీటి తడులను అందిస్తే మంచి దిగుబడి సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News January 26, 2026
CCRHలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి(CCRH) 40 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, M.Pharm/MVSc, PG, MLT, PhD, ME/MTech, BE/BTech, NET/GPAT/GATE/RET ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఫిబ్రవరి 10, 11, 12, 13, 16, 17, 18, 24, మార్చి10తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: ccrhindia.ayush.gov.in


