News May 4, 2024
కూటమికి మైనార్టీలు గుణపాఠం చెప్పాలి: VSR

AP: ముస్లింలకు 4% రిజర్వేషన్ను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు కూటమికి మైనార్టీలు గుణపాఠం చెప్పాలని YCP ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ‘ఆ పార్టీకి ఓటేయటమంటే రిజర్వేషన్ రద్దుకు అంగీకరించినట్లే. టోపీ పెట్టుకుని మసీదులకు వెళ్తున్న CBN అనేకసార్లు మైనార్టీలను మోసం చేశారు. ఉపాధి పథకాలు, ఉపకార వేతనాలు, విదేశీ విద్యలో వారికి ఫలాలు అందకుండా చేసిన చరిత్ర బాబుది’ అని ఆరోపించారు.
Similar News
News December 5, 2025
NRPT: ఎన్నికల సామగ్రి పంపిణీని పర్యవేక్షించిన కలెక్టర్

గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన సామగ్రి పంపిణీని కార్యక్రమాన్ని గురువారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యవేక్షించారు. నారాయణపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని శ్రీ దత్త బృందావన్ బీఈడీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ గురువారం సందర్శించారు. జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు కోస్గి, కొత్తపల్లి, మద్దూరు, గుండుమాల్ మండలాల్లో జరుగుతాయని చెప్పారు.
News December 5, 2025
పంచాయతీ ఎన్నికలు.. తొలి విడతలో 395 స్థానాలు ఏకగ్రీవం

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 4,236 సర్పంచ్ స్థానాలకు గాను 395 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 39 స్థానాలు ఉన్నాయి. అటు సీఎం రేవంత్ నియోజకవర్గం కొడంగల్లో 26 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. ఓవరాల్గా 5 గ్రామాల్లో నామినేషన్లు దాఖలవ్వలేదు. మిగిలిన 3,836 స్థానాలకు ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. కాగా మూడో విడత ఎన్నికల నామినేషన్ గడువు నేటితో ముగియనుంది.
News December 5, 2025
రైతన్నా.. ఈ పురుగుతో జాగ్రత్త

ఖరీఫ్ పంట కోతలు, రబీ పంట నాట్ల వేళ ఏపీ వ్యాప్తంగా 800కు పైగా స్క్రబ్టైఫస్ కేసులు నమోదవ్వడం కలవరపెడుతోంది. చిగ్గర్ అనే పురుగు కాటుకు గురైనవారు తీవ్రజ్వరం, ఒంటి నొప్పులు, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిపాలవుతున్నారు. పొలాలు, అడవులు, తడి నేల, పశువుల మేత ప్రాంతాల్లో పని చేసేవారికి ఈ పురుగుకాటు ముప్పు ఎక్కువగా ఉంది. స్క్రబ్ టైఫస్ లక్షణాలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.


