News January 29, 2025
మైనర్లు లింగ మార్పిడి చేసుకోవడానికి వీల్లేదు: ట్రంప్

యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 19 ఏళ్లలోపు వారు లింగమార్పిడి చేసుకోవడానికి వీలు లేదని ఉత్తర్వులు జారీ చేశారు. పిల్లలు జెండర్ను మార్చుకునేందుకు తాము మద్దతు ఇవ్వబోమని, ఇది దేశ చరిత్రపై మచ్చగా మారే ప్రమాదకరమైన ధోరణి అని పేర్కొన్నారు. తాను రెండు జెండర్లను మాత్రమే గుర్తిస్తానని ట్రంప్ తన ప్రమాణ స్వీకారోత్సవంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News October 27, 2025
అనంతపురం యువకుడికి రూ.2.25 కోట్ల జీతంతో గూగుల్లో ఉద్యోగం

AP: అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన సాత్విక్ రెడ్డి గూగుల్లో ఉద్యోగం సంపాదించారు. న్యూయార్క్లోని Stony Brook Universityలో ఇంజినీరింగ్ పూర్తి చేసి కాలిఫోర్నియాలోని గూగుల్ కంపెనీలో ఉద్యోగం సాధించారని అతడి తండ్రి కొనదుల రమేశ్ రెడ్డి తెలిపారు. ఏడాదికి రూ.2.25 కోట్ల జీతం అందుకోనున్నట్లు వెల్లడించారు. కాగా అనంతపురం మూలాలు ఉన్న సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ CEOగా ఉన్న సంగతి తెలిసిందే.
News October 27, 2025
ఉపవాసాల వెనుక ఉద్దేశ్యం ఇదే..

ధార్మిక ఆచరణలు ప్రారంభించే ముందు శరీరాన్ని, మనస్సును పవిత్రం చేసుకోవాలి. అందులో భాగంగానే ఉపవాసం ఉంటారు. భౌతిక సుఖాలను తాత్కాలికంగా త్యజించడం దీని పరమార్థం. అయితే ఉపవాసమంటే ఆహారం పూర్తిగా మానడం కాదు. ఇది దయ, ఓర్పు, శాంతి వంటి మంచి లక్షణాలను పెంపొందిస్తుంది. కోరికలు, లోభం వంటి చెడు గుణాలను దూరం చేస్తుంది. ఆధ్యాత్మిక గుణాలు లేకుండా, ఉపవాసం పాటిస్తూ కడుపు మాడ్చుకుంటే ఎలాంటి ఫలితం లభించదు. <<-se>>#Aushadam<<>>
News October 27, 2025
పత్తి తేమ 12% దాటితే మద్దతు ధర రాకపోవచ్చు: తుమ్మల

TG: పత్తి అమ్మకాల విషయంలో రైతులు నాణ్యత, తేమ శాతాన్ని దృష్టిలో పెట్టుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పత్తి తేమ 12% మించకుండా చూసుకోవాలన్నారు. 12శాతం మించితే కనీస మద్దతు ధర పొందే అవకాశం ఉండదని తెలిపారు. గరిష్ఠ మద్దతు ధర అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ విషయమై కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చౌహాన్కు లేఖ రాసినట్లు పేర్కొన్నారు.


