News September 5, 2025

అద్భుతం.. బాలభీముడు పుట్టాడు!

image

మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో 34 ఏళ్ల మహిళ 5.2 కేజీల మగపిల్లాడికి జన్మనిచ్చింది. నార్మల్ డెలివరీ సాధ్యపడకపోవడంతో సిజేరియన్ చేశామని వైద్యులు తెలిపారు. ఇంత బరువున్న శిశువును చూడటం ఇదే తొలిసారి అని సంబరపడుతూ అతడితో ఫొటోలు తీసుకున్నారు. ఆ ఫొటోల్లో ఆ పిల్లాడు ఏడాది వయసు ఉన్నవాడిగా కనిపించాడు. సాధారణంగా పిల్లలు 2.5 కేజీల నుంచి 3.2 కేజీల బరువుతో జన్మిస్తారు.

Similar News

News September 7, 2025

జపాన్ ప్రధాని రాజీనామా

image

జపాన్ PM షిగెరు ఇషిబా తన పదవికి రాజీనామా చేశారు. జులైలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ కూటమి ఎగువ సభలో పరాజయం చెందింది. దీనికి బాధ్యత వహించాలంటూ ఆయనపై సొంత పార్టీ(లిబరల్ డెమోక్రటిక్) నేతల నుంచి ఒత్తిడి పెరిగింది. అంతర్గత విభేదాలకు స్వస్తి పలికేందుకు షిగెరు తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతమున్న సంకీర్ణ ప్రభుత్వం త్వరలోనే ప్రధాని అభ్యర్థిని ఎన్నుకోనుంది.

News September 7, 2025

వచ్చే ఎన్నికల నాటికి BRS కనుమరుగు: మహేశ్ గౌడ్

image

TG: బీసీ రిజర్వేషన్లపై కేంద్రం దిగి వచ్చేలా ఈ నెల 15న కామారెడ్డి సభ ఉండనుందని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. BJP నేతలు దేవుడి పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కుంటారని ఫైరయ్యారు. లిక్కర్ రాణిగా కవిత నిజామాబాద్‌కు చెడ్డపేరు తీసుకొచ్చారని విమర్శించారు. కవిత ఎపిసోడ్ KCR ఆడించే డ్రామా అని సందేహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు ఆదరించే పరిస్థితి లేదని, వచ్చే ఎన్నికల నాటికి BRS కనుమరుగవుతుందన్నారు.

News September 7, 2025

ఈ నెల 15 నుంచి UPI లిమిట్ పెంపు.. రోజుకు ఎంతంటే?

image

ఈ నెల 15 నుంచి కొన్ని ప్రత్యేకమైన పేమెంట్స్‌(P2M)కు UPI లిమిట్‌ను రోజుకు రూ.10 లక్షలకు పెంచుతూ NPCI నిర్ణయించింది. ప్రస్తుతం రోజుకు రూ.లక్ష మాత్రమే UPI ద్వారా పంపొచ్చు. ఇన్సూరెన్స్, పన్నులు, స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేవాళ్లకు ఇది ఇబ్బందిగా మారడంతో ఒక్కసారి రూ.5 లక్షలు, రోజుకు రూ.10 లక్షలు పంపుకునే వెసులుబాటు కల్పించింది. కాగా మనం (P2P) స్నేహితులు, బంధువులకు పంపే లిమిట్ మాత్రం రూ.లక్షగానే ఉంది.