News December 21, 2024
మరికొన్ని గంటల్లో అద్భుతం

ఈరోజు ఆకాశంలో అద్భుతం జరగనుంది. ఎప్పటిలా కాకుండా ఈరోజు ముందుగానే రాత్రి కానుంది. భూభ్రమణంలో భాగంగా సూర్యుడి చుట్టూ భూమి తిరిగే కక్ష్య దూరం పెరిగి 16గంటల సుదీర్ఘ రాత్రి ఉండనుంది. ఈరోజు ఉదయం 7.10గంటలకు సూర్యుడు ఉదయించగా సూర్యకాంతి దాదాపు 8 గంటలే ఉండనుంది. ఇలా సుదీర్ఘ రాత్రి ఏర్పడే రోజు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
Similar News
News October 26, 2025
KG చికెన్ ధర ఎంతంటే?

కార్తీక మాసం ప్రారంభమైనా తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు పెద్దగా తగ్గలేదు. ఇవాళ హైదరాబాద్లో స్కిన్ లెస్ కేజీ రూ.220-240, సూర్యాపేటలో రూ.220గా ఉంది. ఏపీలోని విజయవాడలో రూ.240, విశాఖలో రూ.270, చిత్తూరులో రూ.220-245, కర్నూలులో రూ.200-240 వరకు పలుకుతోంది. ఆదివారం కావడంతో రేట్లు తగ్గలేదని, రేపటి నుంచి తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. మరి మీ ఏరియాలో చికెన్ రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి.
News October 26, 2025
దేవాలయ ప్రాంగణంలో పాటించాల్సిన నియమాలు

దేవాలయ ప్రాంగణం పరమ పవిత్ర స్థలం. దైవ దర్శనానంతరం ఆ పవిత్ర స్థలంపై కూర్చుని లౌకిక విషయాలపై చర్చ చేయకూడదు. వ్యాపార, రాజకీయ, అనవసర గృహ విషయాల ప్రస్తావన, వృథా కాలక్షేపాలు దర్శన ఫలాన్ని దూరం చేస్తాయి. దర్శనానంతరం భక్తులు పద్మాసనం/సుఖాసనంలో కూర్చోవాలి. ఈ సమయాన్ని గర్భాలయంలోని దివ్యమంగళ స్వరూపాన్ని, బ్రహ్మానందాన్ని, ఈశ్వరానుభూతిని మనసులో ధ్యానించుకోవాలి. నిశ్చల మనస్సుతో భగవన్నామ స్మరణ చేయాలి.
News October 26, 2025
APPLY NOW: NIOTలో 25 పోస్టులు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (NIOT) 25 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. డిప్లొమా, డిగ్రీ అర్హతగల వారు ఈ నెల 27న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. డిప్లొమా అప్రెంటిస్లకు వయసు 18 నుంచి 24ఏళ్ల మధ్య, డిగ్రీ అప్రెంటిస్లకు వయసు 21 నుంచి 26ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. వెబ్సైట్: https://www.niot.res.in/


