News September 24, 2025
‘OG’ కోసం ఒక్కరోజు థియేటర్లు ఇచ్చిన ‘మిరాయ్’ మేకర్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమా రేపు విడుదల కానుంది. కొన్ని చోట్ల ఇవాళ రాత్రి స్పెషల్ షోలున్నాయి. ఈక్రమంలో ‘మిరాయ్’ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు ‘మిరాయ్’ ప్రదర్శించే చాలా థియేటర్లను ‘OG’కి ఇస్తున్నట్లు తెలియజేశారు. పవన్‌పై ఉన్న అభిమానంతోనే ఇలా చేసినట్లు తెలిపారు. ఇక 26వ తేదీన మళ్లీ ఆ థియేటర్లలో ‘మిరాయ్’ ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం రూ.140+కోట్ల కలెక్షన్లు రాబట్టింది.
Similar News
News February 6, 2026
గుడిలో తలమీద శఠగోపం ఎందుకు పెడతారు?

ఆలయంలో దర్శనం తర్వాత తలపై శఠగోపం పెడతారు. ఆ సమయంలో మనసులో కోర్కెను కోరాలని పండితులు సూచిస్తున్నారు. పూజారికి కూడా వినిపించనంత మెల్లగా మనసులో తలుచుకోవాలని చెబుతారు. ఎందుకంటే.. ఇది మానవునికి శత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు దూరంగా ఉంటామని దేవుని ముందు తలవంచి అంగీకరించడం. ఇలా చేయడం వల్ల మన కోరికలు నెరవేరడమే కాకుండా, మనసులోని దుర్గుణాలు తొలగి ప్రశాంతత లభిస్తుందని నమ్మకం.
News February 6, 2026
సైబర్ బాధితులకు రూ.25వేల వరకు కాంపెన్సేషన్..RBI ప్రపోజల్స్

చిన్న మొత్తాల డిజిటల్, సైబర్ ఫ్రాడ్స్, బలవంతంగా లోన్ రికవరీతో మోసపోయిన బాధితులకు పరిహారం చెల్లించే ప్రతిపాదనలు రెడీ చేస్తున్నట్టు RBI ప్రకటించింది. నష్టపోయిన దాంట్లో 85%/రూ.25వేల వరకు నగదు రెండింటిలో ఏది తక్కువైతే అంత మొత్తాన్ని చెల్లించేలా ఫ్రేమ్‌వర్క్ సిద్ధం చేస్తోంది. OTP చెప్పడం ద్వారా నగదు కోల్పోయిన బాధితులు కూడా జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే కాంపెన్సేషన్ పొందే అవకాశాన్ని కల్పించనుంది.
News February 6, 2026
ఎప్‌స్టీన్ బతికే ఉన్నాడా?

ప్రపంచాన్ని కుదిపేస్తున్న అమెరికా సెక్స్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ బతికే ఉన్నాడంటూ SMలో ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో ఉన్న బడా బాబులు తప్పించుకునేందుకు అతడు చనిపోయాడనే కుట్రకు తెరతీసి దేశం దాటించారనే వాదనలు వినిపిస్తున్నాయి. వాటికి ఆధారంగా పేర్కొంటూ కొన్ని వీడియోలు, ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు అతడిది సూసైడ్ కాదని.. కావాలనే హత్య చేశారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.


