News June 11, 2024
జులై 5న ‘మీర్జాపూర్’ సీజన్ 3 స్ట్రీమింగ్

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ మూడో సీజన్ స్ట్రీమింగ్ అప్డేట్ వచ్చేసింది. జులై 5వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఫస్ట్ సీజన్ 2018 నవంబర్‌లో రిలీజవగా రెండో సీజన్ 2020 అక్టోబర్‌లో స్ట్రీమింగ్ అయింది. ఈ రెండు సీజన్లు అత్యధిక మంది చూసిన ఇండియన్ సిరీస్‌ల్లో టాప్ ప్లేస్‌లో నిలిచాయి.
Similar News
News January 9, 2026
ఈ OTTలోకి ప్రభాస్ ‘రాజాసాబ్’

రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో వచ్చిన ‘రాజాసాబ్’ భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చేసింది. హారర్ కామెడీ జానర్లో ప్రభాస్ వింటేజ్ లుక్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. కాగా ఈ చిత్ర డిజిటల్ హక్కులను జియో హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఈ చిత్రం OTTలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించారు.
News January 9, 2026
NIT వరంగల్ 39 పోస్టులకు నోటిఫికేషన్

<
News January 9, 2026
నల్లమల సాగర్‌కు నీళ్లు తీసుకెళ్తాం: చంద్రబాబు

AP: ముఖ్యమంత్రిగా మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహించడం సంతోషంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ‘పట్టిసీమతో కృష్ణా డెల్టాకు నీళ్లు అందించాం. అప్పుడూ మమ్మల్ని ఇలాగే విమర్శించారు. గొడవలతో ఎవరికీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. నాకు గొడవలు వద్దు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. పోలవరం నుంచి నల్లమల సాగర్‌కు నీళ్లు తీసుకెళ్తాం’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.


