News July 5, 2024

టికెట్ల ధరలపై అపోహలు.. కల్కి నిర్మాత కీలక ప్రకటన

image

సినిమా టికెట్ రేట్ల విషయంలో తన <<13561949>>వ్యాఖ్యలతో<<>> అపోహలు వస్తున్నాయని నిర్మాత సి.అశ్వనీదత్ తెలిపారు. ‘సినిమా టికెట్ల రేట్ల కోసం ప్రతీసారి ప్రభుత్వం చుట్టూ తిరగకుండా ఓ శాశ్వత ప్రతిపాదన చేయాలని పవన్ అన్నారు. నిర్మాతలంతా కూలంకషంగా చర్చించుకొని, సినిమా బడ్జెట్‌ను బట్టి రేట్లు ఎంతవరకు పెంచుకోవచ్చు? వారమా? 10 రోజులా? అనే నిర్ణయానికి వస్తే సీఎంతో చర్చిస్తానని పవన్ అన్నారు’ అని Xలో స్పష్టం చేశారు.

Similar News

News December 27, 2025

REWIND: సునామీని ముందే ఊహించిన చిన్నారి

image

2004 నాటి <<18673724>>సునామీ<<>>కి నిన్నటితో 21 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే ఆ సమయంలో పదేళ్ల టిల్లీ స్మిత్ సునామీని ముందే గ్రహించింది. డిసెంబర్ 26న థాయిలాండ్‌ వెళ్లిన టిల్లీ.. సముద్రం వెనక్కి వెళ్లడం, నీటిలో బుడగలు రావడాన్ని గమనించింది. వెంటనే తల్లిదండ్రులను హెచ్చరించడంతో వందల మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇదంతా తాను జియోగ్రఫీ క్లాస్‌లో నేర్చుకున్నట్లు తెలిపింది. ఆ చిన్నారిని నెటిజన్లు మరోసారి గుర్తుచేసుకుంటున్నారు.

News December 27, 2025

రేపు ట్రంప్‌తో జెలెన్ స్కీ భేటీ!

image

US అధ్యక్షుడు ట్రంప్‌తో రేపు ఫ్లోరిడాలో భేటీ కానున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేర్కొన్నారు. రష్యాతో యుద్ధం ముగింపు, శాంతి ఒప్పందంపై చర్చించనున్నట్లు తెలిపారు. ట్రంప్ ప్రతిపాదించిన 20సూత్రాల ప్రణాళికలో 90% మేర ఏకాభిప్రాయం కుదిరిందని జెలెన్ స్కీ చెప్పారు. రేపటి భేటీలో ఉక్రెయిన్‌కు US ఇచ్చే భద్రతా హామీలపై చర్చించనున్నామన్నారు. కొత్త ఏడాదికి ముందే కీలక పరిణామాలు సంభవించొచ్చని తెలిపారు.

News December 27, 2025

జనవరి 3, 4, 5 తేదీల్లో ప్రపంచ తెలుగు మహాసభలు

image

AP: జనవరి 3,4,5 తేదీల్లో గుంటూరు జిల్లాలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 3 రోజుల పాటు 22 సాహితీ సదస్సులు నిర్వహించనుండగా, 4 రాష్ట్రాల గవర్నర్లు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే 40 దేశాలకు చెందిన 62 తెలుగు సంఘాలకు ఆహ్వానాలు పంపారు. NTR పేరిట ప్రధాన వేదిక ఏర్పాటు కానుంది. ఈ సభలకు తెలుగువారి అనురాగ సంగమంగా నామకరణం చేశారు. 3రోజుల్లో లక్ష మంది వస్తారని అంచనా.