News April 2, 2025
వక్ఫ్ బిల్లుపై అపోహలు సృష్టిస్తున్నారు: అమిత్‌షా

వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగబద్ధమేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. కొన్ని పార్టీలు మైనార్టీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నాయని ఆరోపించారు. వక్ఫ్ బిల్లుపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఈ బిల్లుకు మెజార్టీ వర్గాల మద్దతు ఉందని, ఇది తాము చేపట్టిన అతిపెద్ద సంస్కరణ అని లోక్‌సభలో ఈ బిల్లుపై చర్చలో షా పేర్కొన్నారు.
Similar News
News October 24, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

*త్వరలో ‘సమగ్ర లైఫ్ సైన్సెస్’ పాలసీ.. 2030కల్లా 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చేలా రోడ్ మ్యాప్: మంత్రి శ్రీధర్ బాబు
*గిరిజన ఆశ్రమ స్కూల్స్, హాస్టల్స్ డైలీవేజ్ వర్కర్లకు తగ్గించిన జీతాలు చెల్లిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హామీ
*నాపై KTR చేసిన వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేస్తా: మంత్రి జూపల్లి కృష్ణారావు
*రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గుర్తించి, ఉత్పత్తి చేసేలా ప్లాంట్ ఏర్పాటుకు NFTDC సంస్థతో సింగరేణి ఒప్పందం
News October 24, 2025
చెరకు రసంతో కాంతివంతమైన చర్మం

చర్మకాంతిని పెంచడంలో చెరకురసం సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. * చెరకు రసంలో కొద్దిగా ముల్తానీ మట్టిని కలిపి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి పట్టించి, పావుగంట తర్వాత కడిగేస్తే నల్లమచ్చలు తొలగిపోతాయి. * చెరకు రసంలో కొద్దిగా తేనెను కలిపి ఈ మిశ్రమంతో మసాజ్ చేసి, 10 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మృదువుగా మారుతుంది. * కాఫీపొడికి కాస్త చెరకురసాన్ని చేర్చి స్క్రబ్‌లా ఉపయోగిస్తే చర్మం కాంతులీనుతుంది.
News October 24, 2025
డ్రైవర్లు ప్రమాద తీవ్రత అంచనా వేయలేదు: ఎస్పీ

కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద బస్సు ప్రమాద దుర్ఘటనకు డ్రైవర్ల సమన్వయ లోపం కారణం కావచ్చని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అనుమానం వ్యక్తం చేశారు. బస్సు బైకును ఢీకొన్న విషయాన్ని డ్రైవర్ సెకండ్ డ్రైవర్‌కు చెప్పగా సమన్వయ లోపంతో చిన్న ప్రమాదంగా భావించారన్నారు. ఈ సమయంలోనే కింద నుంచి మంటలు నిమిషాల్లో చుట్టుముట్టాయని వెల్లడించారు. ప్రస్తుతం సెకండ్ డ్రైవర్‌ను తాము అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ చెప్పారు.


