News October 17, 2024
మిస్ ఇండియా-2024.. నిఖిత పోర్వాల్

ఈ ఏడాది ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన నిఖిత పోర్వాల్ సొంతం చేసుకున్నారు. ముంబై వేదికగా 60వ ఎడిషన్ వేడుకలు ఘనంగా జరిగాయి. త్వరలో జరిగే మిస్ వరల్డ్ పోటీల్లో ఆమె భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. రన్నరప్లుగా రేఖా పాండే(దాద్రా నగర్ హవేలీ), ఆయుశీ దోలకియా(గుజరాత్) నిలిచారు.
Similar News
News December 1, 2025
ఈ టీకాతో గర్భాశయ క్యాన్సర్కు 90% చెక్..!

మహిళలకు ప్రాణాంతకమైన గర్భాశయ క్యాన్సర్ను నివారించడంలో హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. HPV టీకా తీసుకున్న బాలికల్లో, టీకా తీసుకోని వారితో పోలిస్తే, గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 80% నుంచి 90% వరకు గణనీయంగా తగ్గినట్లు తాజా డేటా స్పష్టం చేసింది. టీకా తీసుకున్న తర్వాత 15-20 సంవత్సరాల పాటు రక్షణ ప్రభావం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
News December 1, 2025
చిన్న వయసులోనే టీకా ఎందుకు తీసుకోవాలంటే..?

గర్భాశయ క్యాన్సర్కు ప్రధాన కారణమైన హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) సంక్రమించడానికి ముందే టీకా తీసుకోవడం వల్ల అత్యధిక రక్షణ లభిస్తుంది. అందుకే, లైంగిక చర్య ప్రారంభానికి ముందే, అంటే 9 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సులో బాలికలకు టీకా ఇవ్వాలని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. బాలికలకే కాకుండా పురుషాంగం, పాయువు, గొంతు క్యాన్సర్ల రక్షణ కోసం బాలురు కూడా ఈ టీకా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
News December 1, 2025
శివుడు పుర్రెల దండ ఎందుకు ధరిస్తాడు?

పరమ శివుడు పుర్రెల దండ, చితాభస్మం ధరించి శ్మశానంలో తిరుగుతుంటాడు. అందుకు కారణం శిష్టరక్షణ. అసురులు ధర్మబద్ధంగా వరాలు పొంది దేవతలను హింసించేవారు. వారిని మోహానికి గురి చేయడానికి విష్ణుమూర్తి ఆజ్ఞ మేరకు శివుడు ఈ వేషం ధరించి, పాషండ మతాన్ని ఉపదేశించాడు. దీంతో వేద నింద, దైవ నింద చేసిన రాక్షసుల తేజస్సు క్షీణించింది. అలాగే వారి నుంచి దేవతలకు ఉపశమనం లభించింది. ఇది ధర్మ రక్షణకై హరిహరులు చేసిన లీల.


