News March 21, 2025

అట్టహాసంగా మిస్ వరల్డ్ పోటీలు: మంత్రి

image

TG: రాష్ట్రంలో జరగనున్న మిస్ వరల్డ్ పోటీలను ‘తెలంగాణ జరూర్ ఆనా’ నినాదంతో ప్రారంభించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మే10న గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభ వేడుకలు జరగనుండగా 31న హైటెక్స్‌లో ముగింపు వేడుకలను నిర్వహించనున్నారు. మెుత్తంగా 21 ప్రదేశాల్లో 23థీమ్‌లతో ఈవెంట్ నిర్వహించేలా ప్రణాళికలు వేస్తున్నారు. మే7నుంచి31వరకు ఈ పోటీలు జరగనున్నాయి.

Similar News

News October 19, 2025

వీధి వ్యాపారులతో ముచ్చటించిన సీఎం

image

AP: సీఎం చంద్రబాబు విజయవాడ బీసెంట్ రోడ్‌లో పర్యటించారు. పలువురు చిరు, వీధి వ్యాపారులు, జనరల్ స్టోర్, చెప్పుల షాపు నిర్వాహకులతో మాట్లాడారు. జీఎస్టీ 2.0తో ధరల తగ్గింపు గురించి ఆయా వర్గాల వారిని అడిగి తెలుసుకున్నారు. వ్యాపారుల సమస్యలు తెలుసుకోవడంతో పాటు యజమానులు, సామాన్య ప్రజలతో ముచ్చటించారు.

News October 19, 2025

విజయం దిశగా భారత్

image

ఉమెన్ వరల్డ్ కప్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచులో భారత బ్యాటర్లు నిలకడగా రాణిస్తున్నారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (70) రన్స్ చేసి ఔటయ్యారు. ఓపెనర్ స్మృతి మంధాన (63*) క్రీజులో ఉన్నారు. కౌర్, స్మృతి 120కి పైగా భాగస్వామ్యం నమోదు చేశారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 31 ఓవర్లలో 170/3గా ఉంది. టీమ్ ఇండియా విజయానికి 114 బంతుల్లో 119 రన్స్ అవసరం. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

News October 19, 2025

విషం తాగిన తల్లి.. కూతురు ఏం చేసిందంటే?

image

UP మీర్జాపూర్‌కు చెందిన ఐదేళ్ల బాలిక సమయస్ఫూర్తితో తల్లి ప్రాణాలు కాపాడుకుంది. నిన్న తన తల్లి విషం తాగడంతో శివాణి ఉమెన్ హెల్ప్ లైన్ నంబర్ 1090కు కాల్ చేసింది. వెంటనే సమీపంలోని పోలీసులు అక్కడికి చేరుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడు ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. ఎమర్జెన్సీ సమయంలో హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేయాలని స్కూల్లో చెప్పారని ఆ బాలిక చెప్పడంతో ప్రశంసలు కురుస్తున్నాయి.