News September 2, 2024
మిస్ యూ నాన్న: YS జగన్

AP: దివంగత సీఎం, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా జగన్ ఆయనకు నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద తల్లి విజయమ్మతో కలిసి ప్రార్థనలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మిస్ యూ నాన్న అని రాసుకొచ్చారు.
Similar News
News January 20, 2026
ప్రమోషన్ల ఫైల్ కదిలింది.. రిపోర్టులు త్వరగా పంపండి!

TG పోలీస్ శాఖలో అదనపు ఎస్పీ ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న 33 మంది DSPలకు సంబంధించిన ఫైళ్లు ఓ అడుగు ముందుకు పడ్డాయి. వీరి పదోన్నతులకు కీలకమైన ఏసీఆర్ (ACR/CR) నివేదికలు ఇంకా అందకపోవడంపై DGP కార్యాలయం సీరియస్ అయింది. ”ఎన్నిసార్లు చెప్పినా రిపోర్టులు పంపరా?” అని సంబంధిత విభాగాలకు మెసేజ్ వెళ్లింది. ఆలస్యం చేయకుండా వివరాలు పంపాలని DGP ఆఫీస్ ఆ మెసేజ్లో స్పష్టం చేసింది.
News January 20, 2026
నైనీ కోల్ టెండర్లపై CBIతో విచారించాలి: రాంచందర్

TG: నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వివాదంతో CM, మంత్రుల విభేదాలు బట్టబయలయ్యాయని TBJP చీఫ్ రాంచందర్ రావు విమర్శించారు. ‘బంధువులకు గనులు కేటాయించుకోవాలని చూశారు. మీడియాలో వార్తలతో టెండర్లు రద్దు చేశారు. దీనిపై CBI, మరేదైన సంస్థతో విచారించాలి’ అని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసే అర్హత BRSకు లేదన్నారు. BRS హయాం నుంచి ఇప్పటి INC GOVT వరకు జరిగిన అవినీతిపై విచారణ జరగాలని పేర్కొన్నారు.
News January 20, 2026
ఆ దేశాలనూ అమెరికాలో కలిపేసిన ట్రంప్!

యూరోపియన్ దేశాలు, US మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ట్రంప్ రిలీజ్ చేసిన AI జనరేటెడ్ మ్యాప్ వైరల్ అవుతోంది. అందులో కెనడా, గ్రీన్లాండ్, వెనిజులా US భూభాగానికి చెందినవి అన్నట్లు ఉంది. ఈ ఫొటోను ఆయన ట్రూత్లో పోస్ట్ చేశారు. గతేడాది EU లీడర్లతో ట్రంప్ భేటీ కాగా, అప్పటి ఫొటోను మార్ఫ్ చేశారు. ఆ సమయంలో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రాన్, ఇటలీ PM మెలోని, UK PM కీర్ స్టార్మర్ తదితరులతో ట్రంప్ సమావేశమయ్యారు.


