News January 4, 2025
హైదరాబాద్లో తప్పిన విమాన ప్రమాదం

TG: హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టులో విమాన ప్రమాదం తప్పింది. ముంబై-విశాఖ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలోని 144 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఇటీవల వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే
Similar News
News January 29, 2026
అమరావతి రైతులకు మిక్స్డ్ యూజ్ రిటర్నబుల్ ప్లాట్లు!

AP: అమరావతి రెండో విడత ల్యాండ్ పూలింగ్లో రైతులకు మిక్స్డ్ యూజ్ రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలిదశలో వాణిజ్య, నివాస ప్లాట్లు వేర్వేరుగా ఇచ్చారు. దీనివల్ల ఒకే పార్సిల్గా కాకుండా చిన్న ముక్కలుగా మారి కేటాయింపు ఇబ్బంది అయ్యింది. ఈసారి ల్యాండ్ పార్సిల్ ఒకేచోట ఉండేలా చూస్తున్నారు. మిక్స్డ్ యూజ్ నిర్మాణాలకు ఫ్లోర్ స్పేస్ ఇండెక్సూ కీలకం కావడంతో దానిపైనా ఆలోచిస్తున్నారు.
News January 29, 2026
SBI 2273 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News January 29, 2026
తుది దశకు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ 1/2

TG: KCRకు సిట్ నోటీసులతో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తుది దశకు చేరుకుంది. గత BRS హయాంలో ట్యాపింగ్ జరిగిందన్న ప్రభుత్వం రెండేళ్లుగా విచారణ జరుపుతోంది. కేసు తొలుత SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు చుట్టే తిరిగింది. ఆయన విదేశాలకు వెళ్లిపోవడంతో దర్యాప్తు నెమ్మదించింది. ఎట్టకేలకు ప్రభాకర్ రావును విదేశాల నుంచి రప్పించి సుదీర్ఘంగా విచారించారు. ఆయన స్టేట్మెంట్ల ఆధారంగా నాటి కీలక నేతలపై సిట్ ఫోకస్ చేసింది.


