News October 15, 2024
మిసైల్ మ్యాన్ స్ఫూర్తిదాయక కోట్స్!

యువతలో స్ఫూర్తినింపేందుకు APJ అబ్దుల్ కలాం చెప్పిన సూక్తులు మీకోసం. 1. సక్సెస్ అంటే మీ సంతకం ఆటోగ్రాఫ్‌గా మారడమే. 2. నువ్వు సూర్యుడిలా ప్రకాశించాలనుకుంటే.. ముందు సూర్యుడిలా మండటానికి సిద్ధపడాలి. 3. ఒక మంచి పుస్తకం వందమంది మిత్రులతో సమానం. కానీ ఓ మంచి స్నేహితుడు గ్రంథాలయంతో సమానం. 4. కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి. 5. మన జననం సాధారణమైనదే కావచ్చు.. కానీ మన మరణం చరిత్ర సృష్టించేలా ఉండాలి.
Similar News
News January 23, 2026
సునీతా విలియమ్స్ పెన్షన్ ఎంతో తెలుసా?

27 ఏళ్ల సుదీర్ఘ సర్వీస్ తర్వాత రిటైర్ అయిన సునీతా విలియమ్స్‌కు ఏడాదికి దాదాపు ₹36 లక్షల పెన్షన్ వచ్చే అవకాశం ఉంది. FERS ద్వారా అందే ఈ పెన్షన్‌తో పాటు, అమెరికా సోషల్ సెక్యూరిటీ స్కీమ్ నుంచి అదనపు నెలవారీ ఆదాయం కూడా లభిస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, TSP ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ వంటి బెనిఫిట్స్ అందుతాయి. నాసా నుంచి ప్రత్యేక మెడికల్ సపోర్ట్ కొనసాగుతుంది.
News January 23, 2026
దగ్గుబాటి సోదరులపై కోర్టు సీరియస్

TG: ఫిల్మ్‌నగర్‌లోని దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో దగ్గుబాటి సురేశ్, వెంకటేశ్, రానాపై నాంపల్లి కోర్టు ఆగ్రహించింది. ఎన్నిసార్లు కోర్డు ఆర్డర్స్ ధిక్కరిస్తారని ప్రశ్నించింది. సెలబ్రిటీలకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా అని వ్యాఖ్యానించింది. ఎన్నిసార్లు తప్పించుకొని తిరుగుతారని మండిపడింది. FEB 5న కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరవ్వాలని, లేదంటే నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామంది.
News January 23, 2026
IBPS RRB క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

IBPS ఆర్ఆర్బీ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి https://www.ibps.in/ వెబ్సైట్లో ఫలితాలు తెలుసుకోవచ్చు. 8,002 పోస్టుల భర్తీకి డిసెంబర్ 6,7,3,14 తేదీల్లో ప్రిలిమ్స్ నిర్వహించారు. ఫలితాల కోసం ఇక్కడ <


