News August 9, 2025
300కి.మీ దూరం నుంచి మిస్సైళ్లు ప్రయోగించాం: ఏపీ సింగ్

ఆపరేషన్ సిందూర్ చేపట్టిన 3 నెలల తర్వాత ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కీలక ప్రకటన చేశారు. ‘మే 9,10 తేదీల్లో ఆపరేషన్ నిర్వహించాం. పాక్‌తో పాటు పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశాం. 300కి.మీ దూరం నుంచి మిస్సైళ్లు ప్రయోగించాం. ఆపరేషన్ సమయంలో మాకు పూర్తి స్వేచ్ఛ లభించింది. మన డ్రోన్ వ్యవస్థ, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, లోకల్ కమాండర్స్ సమర్థంగా పనిచేశారు’ అని వెల్లడించారు.
Similar News
News August 9, 2025
అది తప్పుడు ప్రచారం: చిరంజీవి

సినీ కార్మికుల డిమాండ్ల పరిష్కారంపై తాను హామీ ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారాన్ని మెగాస్టార్ చిరంజీవి ఖండించారు. ‘కార్మికులకు 30% వేతనం పెంపు తదితర డిమాండ్లు అమలయ్యేలా చూస్తానని, షూటింగ్ ప్రారంభిస్తానని నేను హామీ ఇచ్చినట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను ఎవరినీ కలవలేదు. ఇది ఇండస్ట్రీ సమస్య. వ్యక్తిగతంగా ఎలాంటి హామీ ఇవ్వలేను. ఫిల్మ్ ఛాంబర్‌దే తుది నిర్ణయం’ అని పేర్కొన్నారు.
News August 9, 2025
అరంగేట్రంలోనే అరుదైన రికార్డు

జింబాబ్వేతో రెండో టెస్టులో న్యూజిలాండ్ బౌలర్ జాకరీ ఫౌల్కెస్ రికార్డు సృష్టించారు. అరంగేట్ర మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన(9/75) చేసిన బౌలర్‌గా నిలిచారు. దీంతో విలియమ్ ఓరూర్కీ రికార్డు(9/93)ను అధిగమించారు. ఓవరాల్‌గా భారత మాజీ బౌలర్ నరేంద్ర హీర్వానీ 16/136తో టాప్ ప్లేస్‌లో ఉన్నారు. కాగా ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్&359 రన్స్ తేడాతో జింబాబ్వేను ఓడించిన NZ టెస్టుల్లో మూడో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది.
News August 9, 2025
రాఖీ రోజున ఆడపడుచులకు పవన్ కానుక

AP: రక్షాబంధన్ రోజున ఆడపడుచులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఊహించని కానుక ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 1,500 మంది వితంతు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. వివిధ కారణాలతో భర్తను కోల్పోయిన వారిలో ఆత్మస్థైర్యం నింపి, భరోసా కల్పించాలనే పవన్ ఆదేశాలతో కార్యకర్తలు ఈ కార్యక్రమం నిర్వహించారు. పవన్ స్ఫూర్తితో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు రక్షాబంధన్ కానుకలు అందజేశారు.