News October 9, 2025

సునామీలో మిస్సింగ్.. 14 ఏళ్లుగా వెతుకుతున్న భర్త!

image

ఎంతో ఇష్టమైన భార్యను కోల్పోయి 14 ఏళ్లు అవుతున్నా జపాన్‌కు చెందిన భర్త యసువో టకమాట్సు ఆమె జాడ కోసం సముద్రంలో జల్లెడ పడుతున్నారు. 2011 సునామీలో కొట్టుకుపోయే ముందు భార్య యుకో ‘నాకు ఇంటికి వెళ్లాలని ఉంది’ అని చెప్పారు. ఆ మాట యసువోను 14 ఏళ్లుగా వెంటాడుతోంది. ఆమె మాటలను గౌరవించి స్కూబా డైవింగ్ నేర్చుకొని ఓనగావా సముద్రంలో వెతుకుతున్నారు. తిరిగి రాదని తెలిసినా వెతికే ప్రయత్నాన్ని ఆపట్లేదు.

Similar News

News October 9, 2025

నైట్ డ్యూటీలతో సంతానోత్పత్తిపై ప్రభావం

image

నైట్‌షిఫ్టుల్లో ఎక్కువగా పనిచేయడం వల్ల మహిళల సంతానోత్పత్తిపై ప్రభావం పడుతుందంటున్నారు గైనకాలజిస్టులు. ‘అస్తవ్యస్త పనివేళలతో హార్మోన్ల సమస్యలు, పీరియడ్లు మిస్సవడం వల్ల గర్భధారణలో ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ పోషకాహారం, తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి’ అని సూచిస్తున్నారు.
* ప్రతిరోజూ మహిళలు, చైల్డ్ కేర్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>లోకి వెళ్లండి.

News October 9, 2025

ట్రంప్‌కు మోదీ శుభాకాంక్షలు

image

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌‌‌తో ఫోన్లో మాట్లాడినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. గాజా శాంతి ప్రణాళిక విజయవంతమైనందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపినట్లు ట్వీట్ చేశారు. భారత్, US మధ్య ట్రేడ్ చర్చల పురోగతిపై సమీక్షించినట్లు తెలిపారు. భవిష్యత్‌లో ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగించేందుకు అంగీకరించినట్లు పేర్కొన్నారు.

News October 9, 2025

ట్రంప్ మెడలో నోబెల్ మెడల్.. AI ఇమేజ్ షేర్ చేసిన నెతన్యాహు

image

US ప్రెసిడెంట్ ట్రంప్‌కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని ఇజ్రాయెల్ PM నెతన్యాహు సూచించారు. అందుకు ఆయన అర్హుడని, ఇజ్రాయెల్-హమాస్ మధ్య సీజ్‌ఫైర్, బందీల విడుదలకు ఎంతో కృషి చేశారని ఆకాశానికెత్తారు. నోబెల్ శాంతి బహుమతి ప్రకటనకు ఒకరోజు ముందు నెతన్యాహు తన స్నేహితుడి(ట్రంప్) కోసం ఈ ట్వీట్ చేయడం గమనార్హం. ట్రంప్ నోబెల్ మెడల్ మెడలో వేసుకోగా నెతన్యాహు సహా మరికొందరు చప్పట్లు కొడుతున్న AI ఇమేజ్‌ను షేర్ చేశారు.