News May 7, 2025
ముందే విడుదల కానున్న ‘మిషన్ ఇంపాజిబుల్’!

‘మిషన్ ఇంపాజిబుల్- ది ఫైనల్ రెకనింగ్’ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మూవీ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే నెల 23న విడుదల కావాల్సిన మూవీని భారత్‌లో 17నే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. టామ్ క్రూజ్ గూఢచారి పాత్రలో కనిపించే మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఈ సిరీస్‌లో ‘ది ఫైనల్ రెకనింగ్’ ఆఖరిది కావడంతో మూవీపై భారీ అంచనాలున్నాయి.
Similar News
News March 7, 2026
CEC వేలు కోసేసే వాడిని.. TMC ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు!

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం మమతా బెనర్జీతో CEC చెడుగా ప్రవర్తించారు. CM వైపు వేలు ఎత్తడానికి ధైర్యం చేశారు. CEC కాకపోయుంటే నేను అదే రోజు ఆయన వేలును కోసేసే వాడిని’ అని కోల్‌కతాలో నిరసన కార్యక్రమంలో అన్నారు. SIR విషయంలో గత నెలలో జ్ఞానేశ్ కుమార్, మమత మధ్య జరిగిన సంభాషణను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.
News March 7, 2026
28,740 పోస్టులు.. ఫలితాలు విడుదల

పోస్టాఫీసుల్లో 28,740 బీపీఎం, GDS, ఏబీపీఎం పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్ట్ షార్ట్‌లిస్ట్‌ను తపాలా శాఖ <
News March 7, 2026
ఇరాన్ ఆయుధ నిల్వలు అడుగంటాయా?

ఇరాన్ ఆయుధ నిల్వలు అడుగంటాయని అమెరికా చెబుతోంది. 2 రోజులుగా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై దాడులు తగ్గాయని అంటోంది. క్షిపణి దాడులు 90 శాతం, డ్రోన్ దాడులు 83 శాతం తగ్గినట్లు వైట్‌హౌస్ పేర్కొంది. మరోవైపు ఇరాన్ వద్ద కేవలం 1,000 బాలిస్టిక్ మిసైళ్లు మాత్రమే ఉండొచ్చని యూరేషియా గ్రూప్ ప్రెసిడెంట్ ఇయాన్ బ్రెమ్మర్ అంచనా వేశారు. యుద్ధం మొదట్లో మాదిరి ఇప్పుడు పెద్ద సంఖ్యలో డ్రోన్ దాడులు చేయట్లేదని చెప్పారు.


