News April 16, 2024
ఫెయిల్యూర్స్ లేని ప్రయోగాలే లక్ష్యం: ఇస్రో ఛైర్మన్ సోమనాథ్
2030 నాటికి అవాంతరాలు, ఫెయిల్యూర్స్ లేని అంతరిక్ష ప్రయోగాలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘రాబోయే రోజుల్లో స్పేస్ మిషన్లకు స్పష్టమైన ప్రణాళిక రూపొందించాం. ప్రస్తుతం అంతరిక్ష కక్ష్యలో దేశానికి చెందిన 54 స్పేస్‌క్రాఫ్ట్స్ ఉన్నాయి. మరికొన్ని వినియోగంలో లేనివీ ఉన్నాయి. వీటిని సురక్షితంగా తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు.
Similar News
News November 18, 2024
BGTలో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్లు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక రన్స్ చేసిన యాక్టివ్ ప్లేయర్లలో పుజారా టాప్‌లో ఉన్నారు. 24 టెస్టులు ఆడిన ఆయన 2,033 రన్స్ చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా విరాట్ కోహ్లీ (24 టెస్టులు, 1979 రన్స్), స్టీవ్ స్మిత్ (18 T, 1887 R), రహానే (17 T, 1090 R), లబుషేన్ (9 T, 708 R) ఉన్నారు. కాగా పుజారా, రహానే ఈనెల 22 నుంచి జరగనున్న సిరీస్‌కు ఎంపిక కాలేదన్న విషయం తెలిసిందే.
News November 18, 2024
OTTలోకి వచ్చేసిన నయనతార డాక్యుమెంటరీ
నయనతార కెరీర్, ప్రేమ, పెళ్లిపై ‘నెట్‌ఫ్లిక్స్’ రూపొందించిన డాక్యుమెంటరీ విడుదలైంది. హిందీ, తెలుగు, ఇంగ్లిష్, తమిళ భాషల్లో ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ ఆమె పుట్టినరోజు సందర్భంగా ‘నయనతార-బియాండ్ ది ఫెయిరీ టేల్’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో ‘నానుం రౌడీదాన్’ మూవీకి సంబంధించిన ఫుటేజ్ వాడుకోవడంపై <<14626837>>నయన్, హీరో ధనుష్ మధ్య వివాదం<<>> తలెత్తిన సంగతి తెలిసిందే.
News November 18, 2024
వినూత్నం: చెక్కతో చేసిన ఉపగ్రహం
ప్రపంచంలో చెక్కతో తయారుచేసిన మొట్ట మొదటి ఉపగ్రహం ‘లిగ్నోశాట్’ను ఈనెల 5న అంతరిక్షంలోకి పంపారు. క్యోటో యూనివర్సిటీ & సుమిటోమో ఫారెస్ట్రీ పరిశోధకులు దీనిని అభివృద్ధి చేశారు. ఈ వినూత్న ఉపగ్రహం స్పేస్‌ఎక్స్ మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటుంది. భవిష్యత్తులో మూన్ & మార్స్‌పై అన్వేషణ కోసం కలపను పునరుత్పాదక పదార్థంగా ఉపయోగించవచ్చో లేదో పరీక్షించడం ఈ మిషన్ ఉద్ధేశ్యం.