News September 18, 2024
తప్పు చేసిన వాళ్లు తప్పించుకోలేరు: CM చంద్రబాబు

AP: విశాఖ రైల్వే జోన్‌కు YCP ఐదేళ్ల పాలనలో భూమి ఇవ్వలేదని చంద్రబాబు మండిపడ్డారు. ‘కేంద్ర పథకాలను గత ప్రభుత్వం వినియోగించుకోలేదు. వైసీపీ హయాంలో ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారు. తప్పులు చేసిన ఎవరినీ వదిలిపెట్టం. మనం తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. జగన్ సీఎంగా ఉన్నప్పుడు వాలంటీర్ల వ్యవస్థ గడువు ముగిసినా రెన్యువల్ చేయలేదు. అన్న క్యాంటీన్లను రద్దు చేసి జగన్ దుర్మార్గమైన పని చేశాడు’ అని బాబు విమర్శించారు.
Similar News
News November 24, 2025
బిడ్డ ఆరోగ్యానికి పునాది అక్కడే..

తల్లి కడుపులో బిడ్డ ఉన్నప్పుడే పేగుల్లో మంచి బ్యాక్టీరియాతో కూడిన ‘మైక్రో బయోమ్’ పెరగడం ఆరంభమవుతుంది. గర్భిణి ఆరోగ్యకర ఆహారం తీసుకుంటే ఈ ‘గట్ మైక్రోబయోమ్’ తల్లి నుంచి శిశువుకు వస్తుంది. మనం పుట్టినప్పుడు ఉండే మైక్రోబయోమ్ స్థితి బట్టి.. మన జీవితం ఎంత సాఫీగా, ఆరోగ్యకరంగా ఉంటుందో చెప్పొచ్చంటున్నారు నిపుణులు. ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితుల వల్ల మైక్రో బయోమ్ మారి రకరకాల వ్యాధులు వస్తుంటాయి.
News November 24, 2025
ఐబొమ్మ రవి ఎలా చిక్కాడంటే?

ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది. ఇప్పటివరకు అతడు వెబ్సైట్లకు సంబంధించి ఎలాంటి కీలక సమాచారం చెప్పలేదని తెలుస్తోంది. దీంతో కోర్టులో హాజరుపర్చి మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోరనున్నట్లు సమాచారం. ఇక రవి అరెస్టుపై కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. HYD వచ్చిన రవి ఫ్లాట్‌కు రమ్మంటూ తన ఫ్రెండ్‌కు మెసేజ్ చేశాడు. అప్పటికే ఫ్రెండ్ నంబర్ సంపాదించిన పోలీసులు మెసేజ్ రాగానే వెళ్లి రవిని అరెస్ట్ చేశారు.
News November 24, 2025
నకిలీ వెబ్సైట్ల కలకలం.. శ్రీశైలం భక్తులకు అలర్ట్

AP: శ్రీశైలంలో వసతులు కల్పిస్తామంటూ AP టూరిజం, శ్రీశైలం దేవస్థానం పేరుతో ఫేక్ వెబ్సైట్ల ద్వారా దుండగులు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి ₹30Kతో రూమ్స్ బుక్ చేశారు. అక్కడికి వచ్చి రశీదు చూపించగా సిబ్బంది నకిలీదని చెప్పడంతో షాకయ్యారు. ఇలాగే పలువురు మోసాలకు గురయ్యారు. దీంతో ఆయా వెబ్సైట్లపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు EO శ్రీనివాసరావు తెలిపారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.


