News March 11, 2025

ఇంటర్ క్వశ్చన్ పేపర్లలో మళ్లీ తప్పులు!

image

TG: ఇవాళ్టి ఇంటర్ ఫస్టియర్ బోటనీ, మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్లలో తప్పులు దొర్లినట్లు తెలుస్తోంది. దీంతో తప్పులు సరిచేసి విద్యార్థులకు తెలపాలని ఇంటర్‌ బోర్టు ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే సెకండియర్ ఇంగ్లిష్ ప్రశ్నపత్రం ముద్రణలో ఏడో ప్రశ్న అస్పష్టంగా ఉండటంతో, ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేసిన విద్యార్థులకు 4 మార్కులు కలుపుతామని ఇంటర్ బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Similar News

News January 17, 2026

యూరియాకు గుళికలు కలుపుతున్నారా?

image

వరి సాగులో చాలా మంది రైతులు మొదటి దఫా యూరియా వేసేటప్పుడు బస్తా యూరియాకు 4-5 కిలోల గుళికల మందును కలిపి చల్లుతారు. పైరు బాగా పెరగడానికి యూరియా.. పురుగుల నివారణకు గుళికల మందు ఉపయోగపడుతుందనేది రైతుల భావన. కానీ పురుగుల కట్టడికి ఎకరాకు మందు రకాన్ని బట్టి 8-10 కిలోల గుళికలు అవసరం. తక్కువ వేస్తే పురుగులు వాటిని తట్టుకొని నిలబడతాయి. అందుకే రైతులు గుళికల మందు వాడకంలో వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం ముఖ్యం.

News January 17, 2026

C-DAC 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

బెంగళూరులోని <>C-DAC<<>> 60 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల వారు నేటి నుంచి జనవరి 31 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE/BTech, ME/MTech, PG, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cdac.in

News January 17, 2026

పెళ్లికాని ఆడపిల్లలు తప్పక చేయాల్సిన పూజ

image

సావిత్రి గౌరీ వ్రతం, బొమ్మల నోము ముత్తయిదువులే కాకుండా, పెళ్లికాని ఆడపిల్లలకు కూడా ఎంతో ముఖ్యమైనది. వారు ఈ నోము నోచుకోవడం వల్ల పార్వతీ దేవికి శివుడు లభించినట్లుగా, తమకు కూడా సద్గుణ సంపన్నుడైన భర్త లభిస్తాడని నమ్ముతారు. పూజా సమయంలో ‘గౌరీ కళ్యాణం’ వంటి పవిత్ర గాథలను చదువుకోవడం వల్ల మనసు నిర్మలమవుతుంది. సంప్రదాయబద్ధంగా సాగే ఈ వేడుక పిల్లలలో భక్తి భావాన్ని, సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంపొందిస్తుంది.