News July 20, 2024
సీనియారిటీ జాబితాలో తప్పులు.. నర్సుల బదిలీలు వాయిదా!

TG: సీనియారిటీ జాబితాలో తప్పులు దొర్లడంతో ప్రజారోగ్యశాఖలో స్టాఫ్ నర్సుల బదిలీల కౌన్సెలింగ్ వాయిదా పడింది. నిన్న కౌన్సెలింగ్ కోసం వివిధ ప్రాంతాల నుంచి 10,000+ నర్సులు HYDలోని ఉస్మానియా మెడికల్ కాలేజీకి వచ్చారు. సీనియారిటీ లిస్టులో తప్పులు ఉండడంతో ఆందోళనకు దిగారు. పలు మార్లు చర్చల అనంతరం బదిలీ ప్రక్రియ చివరకు వాయిదా పడింది. ఆన్లైన్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పడంతో నర్సులు నిరసన తెలిపారు.
Similar News
News November 27, 2025
సిద్దిపేట: మొదటి రోజు 131 నామినేషన్స్

స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో గురువారం నుంచి మొదటి విడత నామినేషన్స్ ప్రారంభమయ్యాయి. సిద్దిపేట జిల్లాలో మొదటి రోజు గురువారం గజ్వేల్ నియోజకవర్గంలో 163 గ్రామ పంచాయితీలకు 131 నామినేషన్స్ రాగా, 1432 వార్డులకు 75 నామినేషన్స్ వచ్చాయని అధికారులు తెలిపారు.
News November 27, 2025
ఇల్లు మూలల ఆధారంగా ఉంటే ఏ దిక్కున పడుకోవాలి?

ఇల్లు మూలలకు ఉన్నప్పుడు నైరుతి మూలకు తల, ఈశాన్య మూలకు కాళ్లు పెట్టుకుని పడుకోవడం మంచిదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇది చక్కటి నిద్రకు, ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు. ‘నైరుతి స్థిరమైన శక్తినిస్తుంది. ఈశాన్యం నుంచి పాదాల ద్వారా శుభకరమైన కాస్మిక్ శక్తిని స్వీకరించడానికి సహాయపడుతుంది. అలాగే పనుల పట్ల ఏకాగ్రతను పెంచుతుంది’ అని వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>
News November 27, 2025
సీఎం Vs డిప్యూటీ సీఎం.. SMలో మాటల యుద్ధం

కర్ణాటక CM సిద్దరామయ్య, Dy.CM డీకే శివకుమార్ మధ్య SMలో మాటల యుద్ధం సాగుతోంది. ‘మాట నిలబెట్టుకోవడం ప్రపంచంలోనే గొప్ప బలం’ అని శివకుమార్ తొలుత ట్వీట్ చేశారు. దీనికి ‘ఒక మాట ప్రజల కోసం ప్రపంచాన్ని మార్చలేకపోతే అది బలం కాదు’ అని సిద్దరామయ్య కౌంటర్ ఇచ్చారు. ‘కర్ణాటకకు మా మాట కేవలం నినాదం కాదు.. అదే మాకు ప్రపంచం’ అనే పోస్టర్ షేర్ చేశారు. ‘నా నాయకత్వంలో పలు నిర్ణయాలు తీసుకున్నా’ అని CM ట్వీట్లు చేశారు.


