News November 22, 2024

చరిత్రలో ఎవరూ చేయని తప్పులు చేశారు: CBN

image

AP: చరిత్రలో ఎవరూ చేయని తప్పులు గత సీఎం జగన్ చేశారని CM చంద్రబాబు అన్నారు. వ్యవస్థలు విధ్వంసమయ్యాయని, అధికార యంత్రాంగం నిర్వీర్యమైందని మండిపడ్డారు. నమ్మిన అసత్యాలను పదే పదే చెప్పి ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. అందుకే విజన్ డాక్యుమెంట్ -2047పేరుతో షార్ట్, మీడియం, లాంగ్ టర్మ్ లక్ష్యాలతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. రౌడీ రాజకీయాలు చేస్తామంటే పెట్టుబడిదారులు రాష్ట్రానికి రారని సీఎం తెలిపారు.

Similar News

News November 22, 2024

దీపక్ హుడా బౌలింగ్‌పై నిషేధం?

image

టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ దీపక్ హుడా బౌలింగ్ శైలి అనుమానాస్పదంగా ఉండటంతో బీసీసీఐ సస్పెక్టెడ్ బౌలర్స్ లిస్టులో చేర్చింది. కరియప్ప, సౌరవ్ దూబే కూడా ఈ జాబితాలో ఉన్నారు. మరోవైపు మనీశ్ పాండే, శ్రీజిత్ కృష్ణన్ బౌలింగ్‌పై బీసీసీఐ ఇప్పటికే నిషేధం విధించిందని సమాచారం. కాగా దీపక్ హుడా భారత్ తరఫున 10 వన్డేలు, 21 టీ20లకు ప్రాతినిధ్యం వహించారు. ఐపీఎల్‌లో 118 మ్యాచులు ఆడారు.

News November 22, 2024

పార్లమెంట్ సమావేశాల్లో వ్యూహాలపై చర్చ

image

AP: ఈ నెల 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ తమ పార్టీ ఎంపీలతో వేర్వేరుగా సమావేశం అయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలు, రాష్ట్రాభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించారు. ఎంపీలకు సీఎం, పవన్ దిశానిర్దేశం చేశారు.

News November 22, 2024

గంభీర్ మాటలతో స్ఫూర్తి పొందాను: నితీశ్ రెడ్డి

image

బౌన్సర్‌ అయినా సరే తట్టుకుని నిలబడాలని కోచ్ గౌతమ్ గంభీర్ చెప్పిన మాటలు తనకు స్ఫూర్తినిచ్చాయని టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తెలిపారు. ‘చివరి ప్రాక్టీస్ సెషన్ తర్వాత గౌతమ్ నాతో మాట్లాడారు. బౌన్సర్ వచ్చినప్పుడు దేశం కోసం తూటాకు అడ్డునిలబడినట్లే భావించాలని చెప్పారు. ఆ మాటలు నాలో నాటుకుపోయాయి. ఆయన్నుంచి నేను విన్న బెస్ట్ సలహా అది’ అని పేర్కొన్నారు.