News January 2, 2025

ఆఖరి టెస్టుకు మిచెల్ మార్ష్‌పై వేటు

image

సిడ్నీలో రేపటి నుంచి జరిగే ఆఖరి టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు మిచెల్ మార్ష్‌ను తప్పించింది. అతడి స్థానంలో బ్యూ వెబ్‌స్టెర్‌ను జట్టులోకి తీసుకుంది. ఆల్‌రౌండర్‌గా జట్టులో ఉన్న మార్ష్, 2 విభాగాల్లోనూ ఘోరంగా విఫలమయ్యారు. నాలుగు టెస్టుల్లో 33 ఓవర్లు వేసి 3 వికెట్లే తీశారు. ఇక బ్యాటింగ్‌లో కేవలం 73 పరుగులే చేశారు. ప్రస్తుతం మెల్‌బోర్న్ స్టార్స్ తరఫున BBL ఆడుతున్న వెబ్‌స్టెర్‌కి ఇదే తొలి మ్యాచ్ కానుంది.

Similar News

News December 21, 2025

BR అంబేడ్కర్ వర్సిటీలో 71 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

image

ఢిల్లీలోని డాక్టర్ <>BR<<>> అంబేడ్కర్ యూనివర్సిటీ 71 టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 9 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని JAN 16వరకు పంపవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PG, PhD/M.Phil, NET, SLAT, SET, M.Ed, M.LSc ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ప్రజెంటేషన్/సెమినార్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://aud.delhi.gov.in

News December 21, 2025

514 పోస్టులు.. అప్లికేషన్ల స్వీకరణ మొదలు

image

బ్యాంక్ ఆఫ్ ఇండియా 514 క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్ల స్వీకరణ మొదలైంది. ఆన్‌లైన్‌లో 2026 జనవరి 5వ తేదీ వరకూ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీస విద్యార్హత డిగ్రీ, పోస్టులను బట్టి వయస్సు: 25-40 పరిమితి ఉంది. ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ప్రతిభ ఆధారంగా (70:30) ద్వారా ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు BOI అధికారిక సైట్ చూడండి.

News December 21, 2025

దూసుకెళ్తున్న మహాయుతి

image

మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల కౌంటింగ్‌లో మహాయుతి కూటమి దూసుకెళ్తోంది. 246 మున్సిపల్ కౌన్సిల్ స్థానాలు, 42 నగర పంచాయతీల్లో బీజేపీ 116+, శివసేన 50+, ఎన్సీపీ 34+ చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. శివసేన యూబీటీ 12, ఎన్సీపీ(SP) 12, కాంగ్రెస్ 28+ స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నాయి.