News June 21, 2024

చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్

image

క్రికెట్ వరల్డ్ కప్‌లలో అత్యధిక వికెట్లు(52 మ్యాచ్‌లలో 95) తీసిన బౌలర్‌గా మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించారు. ఇతను ODIWCలో 65, T20WCలో 30 వికెట్లు పడగొట్టారు. మలింగ(59M-94W)ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో షకీబ్ అల్ హసన్-బంగ్లాదేశ్(75M- 92W), ట్రెంట్ బౌల్ట్-న్యూజిలాండ్(47M-87W), మురళీధరన్-శ్రీలంక(49M-79W) ఉన్నారు.

Similar News

News September 15, 2025

బాక్సాఫీస్ వద్ద ‘మిరాయ్’ కలెక్షన్ల సునామీ

image

తేజా సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ‘మిరాయ్’ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.81.20 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు. మంచు మనోజ్ కీ రోల్ చేయగా, రితికా నాయక్ హీరోయిన్‌గా నటించారు. తొలి రోజు రూ.27.2 కోట్లు రాగా, రెండో రోజు రూ.28.4కోట్లు, మూడో రోజు 25.6 కోట్లు వచ్చాయి.

News September 15, 2025

శివుడికి మూడో నేత్రం ఎలా వచ్చింది? (1/2)

image

శివుడు త్రినేత్రుడు. మరి ఆయనకు మూడో నేత్రం ఎలా వచ్చిందో మీకు తెలుసా? ‘శివుడు ఒకనాడు ధ్యానంలో ఉండగా పార్వతీ దీవి సరదాగా వెళ్లి ఆయన కళ్లు మూసింది. దీంతో లోకమంతా చీకటి ఆవహించింది. అప్పుడు శివుడు తన శక్తులను ఏకం చేసి నుదుటిపై మూడవ నేత్రాన్ని ఆవిష్కరించి, తెరిచాడు. లోకాన్ని వెలుగుతో నింపాడు’ అని పండితులు చెబుతున్నారు. ఈశ్వరుడి త్రినేత్రానికి సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది.

News September 15, 2025

శివుడికి మూడో నేత్రం ఎలా వచ్చింది? (2/2)

image

సృష్టికి మూలమైన ఆదిపరాశక్తి త్రిమూర్తులను సృష్టించింది. సృష్టి, స్థితి, లయ కారకులుగా ఉండమని వారిని కోరింది. కానీ వారు నిరాకరించారు. దీంతో ఆమె తన మూడో నేత్రంతో వారిని భస్మం చేస్తానని చెప్పింది. అప్పుడు శివుడు ఆ నేత్రాన్ని తనకు ఇవ్వమని కోరాడు. ఆయన ప్రార్థనను మన్నించిన ఆమె ఆ కంటిని ప్రసాదించింది. శివుడు ఆ నేత్రంతో ఆమెను భస్మం చేసి, దాన్ని 3 భాగాలుగా విభజించి లక్ష్మి, సరస్వతి, పార్వతులను సృష్టించాడు.