News June 16, 2024
MLAగా విజయం.. కాలినడకన ద్వారకాతిరుమలకు
ఏలూరు జిల్లా పోలవరం MLAగా చిర్రి బాలరాజు విజయం సాధించిన నేపథ్యంలో ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయానికి స్థానిక టీడీపీ, జనసేన నాయకులు శనివారం కాలినడక బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి గెలిస్తే పాదయాత్రగా వస్తామని మొక్కుకున్నట్లు తెలిపారు. నరసింహమూర్తి, శ్రీను, ప్రసాద్, కృష్ణ తదితరులు ఉన్నారు.
Similar News
News November 17, 2024
దేవరపల్లి: కార్తీకమాసంలో చికెన్ ధరలు ఇలా
ప.గో జిల్లాలోని పలు ప్రాంతాలలో చికెన్ పై శ్రావణమాసం ఎఫెక్ట్ పడుతోంది. అయితే జిల్లాలో పలుచోట్ల ధరలు తగ్గితే .. కొన్నిచోట్ల మాత్రం సాధారణంగానే ఉన్నాయి. కాగా దేవరపల్లి మండలంలోని దుద్దుకూరు గ్రామంలో చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. కేజీ ఫారం మాంసం రూ. 200గా ఉంది, బ్రాయిలర్ రూ. 220 ఉంది. అయితే కార్తీకమాసం కావడంతో వినియోగదారులు తక్కువగా ఉన్నారని వ్యాపారస్థులు చెబుతున్నారు.
News November 17, 2024
తాడేపల్లిగూడెంలో ఎయిర్ పోర్ట్
రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, అందులో పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం ఒకటి. ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కోసం ఆ ప్రాంతంలో 1,123 ఎకరాలను గుర్తించింది. పారిశ్రామిక , వ్యాపార , పర్యాటకం ఇలా అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
News November 17, 2024
ప.గో : బాలికపై అత్యాచారం
చాగల్లుకు చెందిన బాలిక(14)పై వరుసకు మేనమామ అయే కమల్(22) అత్యాచారం చేశాడు. పోలీసుల కథనం..బాలిక సమిశ్రగూడెం ఎస్సీ వెల్ఫేర్ హాస్టళ్లో చదువుకుంటోంది. ఆధార్‌లో మార్పులు చేయడానికి తాడేపల్లిగూడెం వాసి కమల్‌ను బాలిక అమ్మమ్మ పంపింది. అతను తీసుకొచ్చి అత్యాచారం చేసి వాళ్ల ఇంట్లో అప్పగించాడు. బాలిక ఇంట్లో విషయం చెప్పగా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.