News June 16, 2024

MLAగా విజయం.. కాలినడకన ద్వారకాతిరుమలకు

image

ఏలూరు జిల్లా పోలవరం MLAగా చిర్రి బాలరాజు విజయం సాధించిన నేపథ్యంలో ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయానికి స్థానిక టీడీపీ, జనసేన నాయకులు శనివారం కాలినడక బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి గెలిస్తే పాదయాత్రగా వస్తామని మొక్కుకున్నట్లు తెలిపారు. నరసింహమూర్తి, శ్రీను, ప్రసాద్, కృష్ణ తదితరులు ఉన్నారు.

Similar News

News May 7, 2025

జిల్లాలో ప్రస్తుతానికి ఎవరూ లేరు: ఎస్పీ

image

పశ్చిమగోదావరి జిల్లాలో పాకిస్థానీలు ప్రస్తుతానికి ఎవరూ లేరని జిల్లా అద్నాన్ నయీమ్ అస్మి శనివారం తెలిపారు. కేంద్ర హోం శాఖ మంత్రి ఆదేశాలతో పాస్పోర్ట్, వీసాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా పోలీసులు తనిఖీల్లో ప్రజల సహకరించాలని కలెక్టర్  నయీమ్ అస్మి విజ్ఞప్తి చేశారు.

News May 7, 2025

యథావిధిగా పీజిఆర్ఎస్: ప.గో కలెక్టర్

image

ప. గో. జిల్లా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాసమస్యల పరిష్కారవేదిక (PGRS) మీకోసం సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. అలాగే “1100 మీకోసం కాల్ సెంటర్” ద్వారా ఫిర్యాదులను నమోదు చేయుట, నమోదు అయిన ఫిర్యాదుల స్థితిగతులు తెలుసుకోవచ్చన్నారు. అన్ని మండల స్థాయి డివిజన్ స్థాయిలో యథావిధిగా పీజిఆర్ఎస్ జరుగుతుందన్నారు.

News May 7, 2025

పాలకొల్లు: చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్

image

సీఎం చంద్రబాబు, డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్‌‌ను సోషల్ మీడియాలో దూషిస్తూ అసభ్య పోస్టులు పెట్టిన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం చిగురుపాడుకు చెందిన అమిత్ హరిప్రసాద్‌ను పాలకొల్లు పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అనంతరం పాలకొల్లు పీఎస్‌లో మీడియాకు వివరాలు తెలిపారు. హరిప్రసాద్ సోషల్ మీడియాలో పెట్టిన అసభ్య పోస్టులపై బీసీ నాయకుడు ధనాని సూర్య ప్రకాష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు.