News March 19, 2026
MLAగా నారా రోహిత్ పోటీ..?

చంద్రగిరి(M) నారావారిపల్లెలో హీరో రోహిత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. భవిష్యత్తులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని స్పష్టం చేశారు. ఆయన తండ్రి నారా రామ్మూర్తి నాయుడు ఇది వరకు చంద్రగిరి MLAగా గెలిచారు. ఇప్పుడు అక్కడ పులివర్తి నాని సిట్టింగ్ MLAగా ఉన్నారు. ఒకవేళ రోహిత్ ఎన్నికల్లో పోటీచేస్తే ఇక్కడి నుంచే పోటీ చేస్తారా లేక మరోదైనా నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తారా అన్న విషయం తేలాల్సి ఉంది.
Similar News
News March 26, 2026
విజయవాడలో భారీగా గంజాయి సీజ్..!

విజయవాడ రైల్వే స్టేషన్‌లో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో ఈగల్, RPF సిబ్బంది మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో 65 కేజీల గంజాయి దొరికింది. అక్రమ రవాణాకు పాల్పడుతున్న 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఈగల్ టీం సీఐ రవీంద్ర తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
News March 26, 2026
కోనసీమ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతలేదు: DSO

కోనసీమ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని డీఎస్ఓ అడపా ఉదయభాస్కర్ బుధవారం తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దన్నారు. అధికంగా ఆయిల్ కొనుగోలు చేసి కృత్రిమ కొరత సృష్టించవద్దని సూచించారు. వాహనాలకు మాత్రమే ఆయిల్ సరఫరా చేయాలని, పెద్ద పెద్ద బాటిల్స్, క్యాన్లలో పెట్రోల్ తీసుకు వెళ్లేందుకు బంకులకు వస్తున్నారని, ఇది చట్ట విరుద్ధమన్నారు. వీటిని ప్రోత్సహించవద్దని బంకు యజమానులకు సూచించారు.
News March 26, 2026
వేప పిండి, పిడకల ఎరువుతో కలిగే లాభాలు

ఒక టన్ను వేప పిండిని దుక్కిలో(లేదా) పంట పెట్టిన తర్వాత వేస్తే 52 నుంచి 55KGల నత్రజని, 10KGల భాస్వరం, 14-15KGల పొటాష్ ఇతర పోషకాలు పంటకు అందుతాయి. బాగా పొడిచేసిన పిడకల ఎరువు(36-40 బస్తాలు)ను సాగు భూమిలో వేస్తే 5-15KGల నత్రజని, 3-9KGల భాస్వరం, 5-19KGల పొటాష్ ఇతర పోషకాలు పంటకు అందుతాయి. వేపపిండిలోని పోషకాల శాతం భూమికి అదనపు బలాన్నిచ్చి, చీడపీడలు, తెగుళ్ల ముప్పును తగ్గిస్తుంది.


