News August 13, 2024

MLA చింతమనేనికి ఫోన్ కాల్స్.. కేసు నమోదు

image

దెందులూరు MLA చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్స్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్న వారిపై కేసు నమోదు చేసినట్లు ఏలూరు త్రీ టౌన్ పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. చింతమనేనికి కొంతకాలంగా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటూ చింతమనేని కాల్ డేటా సమర్పించగా కేసు నమోదు చేశామన్నారు. మాజీ MLA అబ్బయ్య చౌదరి అనుచరుల పనే అని చింతమనేని ఆరోపిస్తున్నారు.

Similar News

News December 8, 2025

భీమవరం: రక్తదాన వార్షికోత్సవ గోడపత్రికలు ఆవిష్కరణ

image

భీమవరం కలెక్టరేట్‌లో జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి ప.గో.జిల్లా యూనిట్ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాలో 2026వ సంవత్సర వార్షిక రక్తదాన శిబిరాల ఏర్పాటు గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందితో 2025 డిసెంబర్ 1 నుంచి 2026 నవంబర్ 30 వరకు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు.

News December 8, 2025

ప.గో జిల్లా కీలక నేత వైసీపీకి ‘బై’

image

తాడేపల్లిగూడేనికి చెందిన వైసీపీ ఎస్టీ విభాగం జిల్లా మాజీ అధ్యక్షుడు కావాడి శివ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రసాద్ రాజుకు అందజేసినట్లు సోమవారం తెలిపారు. పార్టీ కార్యక్రమాల సమాచారం ఇవ్వకపోవడం, తగిన గుర్తింపు లేకపోవడం వంటి కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తు కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానన్నారు.

News December 8, 2025

ఘోర అగ్నిప్రమాదంలో తాడేపల్లిగూడెం యువకుడి మృతి

image

అమెరికాలోని బర్మింగ్ హామ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. అందులో తాడేపల్లిగూడేనికి చెందిన అన్వేష్ రెడ్డి ఒకరు. ఘటనలో తీవ్రగాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కాగా వీరి కుటుంబం HYDలోని కూకట్ పల్లిలో నివాముంటోంది.