News August 13, 2024

MLA చింతమనేనికి ఫోన్ కాల్స్.. కేసు నమోదు

image

దెందులూరు MLA చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్స్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్న వారిపై కేసు నమోదు చేసినట్లు ఏలూరు త్రీ టౌన్ పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. చింతమనేనికి కొంతకాలంగా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటూ చింతమనేని కాల్ డేటా సమర్పించగా కేసు నమోదు చేశామన్నారు. మాజీ MLA అబ్బయ్య చౌదరి అనుచరుల పనే అని చింతమనేని ఆరోపిస్తున్నారు.

Similar News

News September 13, 2024

ప.గో.: గాంధీ తత్వంపై చిత్రలేఖనం పోటీలు

image

గాంధీ జయంతి సందర్భంగా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో చిత్రలేఖనం పోటీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సర్వోదయ మండలి ఉమ్మడి ప.గో.జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు మాట్లాడుతూ.. ‘గాంధీ తత్వం- నేటి భారతం’ అంశంపై ఏ4 సైజ్ డ్రాయింగ్‌ షీటుపై చిత్రం వేసి, స్కాన్‌ చేసి ispeducation@gmail.com మెయిల్‌‌కు ఈ నెల 21వ తేదీ లోపు పంపాలన్నారు.

News September 13, 2024

పేరుపాలెం బీచ్‌కి వచ్చే పర్యాటకులకు విజ్ఞప్తి

image

మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌కి వచ్చే పర్యాటకులకు అధికారులు విజ్ఞప్తి చేశారు. పేరుపాలెంలోని మొలపర్రు కనకదుర్గా బీచ్‌కి వెళ్లే మార్గంలో రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో ఆ రహదారి మీదుగా ప్రయాణాలు నిలిపివేశామన్నారు. పర్యాటకులు ఈ విషయం గమనించి ఇతర మార్గాల్లో బీచ్‌కు వెళ్లాలని కోరారు.

News September 13, 2024

ఏలూరు జిల్లాలో వైసీపీ నేత మృతి

image

ఏలూరు జిల్లాలో విషాదం నెలకొంది. కామవరపుకోట మండలం కళ్ళచెరువుకు చెందిన AMC మాజీ ఛైర్మన్ మేడవరపు అశోక్ బాబు శుక్రవారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల ఏలూరు జిల్లాలోని రాజకీయ నాయకులు, ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.