News November 19, 2024

MLA చిన్నరాజప్పకు కితాబు ఇచ్చిన RRR

image

పెద్దాపురం నియోజకవర్గంలోని ఏలేరు కాలువ అభివృద్ధి అంశంపై అసెంబ్లీలో MLA చిన్నరాజప్ప మాట్లాడారు. ఇటీవల వరదల కారణంగా డ్యామ్ కొట్టుకుపోయిందని, సీఎం పరిశీలించి నిధులు కేటాయిస్తామని చెప్పారని సభలో గుర్తు చేశారు. త్వరగా టెండర్లను పిలిపించి పనులు పూర్తి చేయాలని క్తుప్లంగా వివరించారు. దీంతో తక్కువ సమయంలో సమస్యను చక్కగా వివరించారంటూ చినరాజప్పకు Dy. స్పీకర్ RRR కితాబు ఇచ్చారు.

Similar News

News December 11, 2025

PHC & UPHC సేవల్లో అగ్రస్థానంలో తూ.గో జిల్లా

image

జూన్ 2025 – డిసెంబర్ 2025 వరకు నిర్వహించిన IVRS Perception Feedback Analysisలో తూ.గో జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా 87.5% సానుకూల స్పందన నమోదు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. ఈ ర్యాంకింగ్ జిల్లా వైద్య ఆరోగ్య వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. అలాగే మరింత ఉన్నత ప్రమాణాలతో సేవలు అందించాల్సిన బాధ్యత పెరిగిందన్నారు.

News December 11, 2025

రాజమండ్రి: ‘యూరియా కొరత లేదు’

image

జిల్లాలో యూరియా కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 7599.34 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. డీసీఎంఎస్‌లో 257.36, పీఏసీఎస్‌లో 2530.03, ఆర్ఎస్కేల్లో 114.53, ప్రైవేట్ డీలర్ల వద్ద 1993.10, మార్క్ఫెడ్ వద్ద 2604.20, హోల్సేల్ ప్రైవేట్ డీలర్ల వద్ద 100.14 మెట్టు టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు.

News December 11, 2025

కందుల దుర్గేశ్‌కు 7వ ర్యాంకు

image

పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ పాలనలో జెట్ స్పీడ్ చూపిస్తున్నారు. ఫైళ్ల పరిష్కారంలో రాష్ట్రంలోనే 7వ ర్యాంకు సాధించి సీఎం ప్రశంసలు పొందారు. జనసేన కోటాలో మంత్రి అయిన దుర్గేశ్.. 316 ఫైళ్లను కేవలం 3 రోజుల 9 గంటల 21 నిమిషాల సమయంలోనే క్లియర్ చేసి సత్తా చాటారు. కాగా ఫైళ్ల పరిష్కారంలో జనసేనాని పవన్ కళ్యాణ్ 11వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.