News January 26, 2025
MLA మల్లారెడ్డి పేరు మరిచారు!

ఘట్కేసర్ మున్సిపాలిటీలోని బొక్కోనిగూడ 3వార్డులో బీటి రోడ్డుకు ఈనెల 24న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. శిలాఫలకంలో మాజీ మంత్రి, MLA మల్లారెడ్డి పేరుకు బదులు వెంకట్ నారాయణ రెడ్డి పేరు వేశారు. ఎమ్మెల్యే పేరు మరిచారని, శిలాఫలకంలో పేరు మార్చాలని బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Similar News
News December 13, 2025
తంగళ్ళపల్లి: 700 మందితో పటిష్ట బందోబస్తు: ఎస్పీ

రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు 700 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. తంగళ్ళపల్లిలోని పోలీస్ స్టేషన్ను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ శాఖ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామన్నారు.
News December 13, 2025
హెచ్పీవీని జాతీయ టీకాల జాబితాలో చేర్చాలి: విశాఖ సీపీ

గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ (HPV) వ్యాక్సిన్ను జాతీయ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్లో చేర్చాలని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. చైతన్య స్రవంతి, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోలీసు, హోంగార్డుల కుమార్తెలకు (9-14 ఏళ్లు) ఏర్పాటు చేసిన ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్ను ఆయన శనివారం ప్రారంభించారు. వ్యాక్సిన్పై అవగాహన కల్పించేందుకు త్వరలో బీచ్ రోడ్డులో ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు.
News December 13, 2025
నిర్మల్: పోలింగ్ సిబ్బందితో మాటామంతీ

నిర్మల్ జిల్లాలో ఆదివారం నిర్వహించే రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలింగ్ సిబ్బందికి కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి శనివారం పలు సూచనలు చేశారు. స్థానిక మినీ ఎన్టీఆర్ స్టేడియంలో పోలింగ్ సామగ్రి తీసుకొని బస్సుల్లో బయలుదేరుతున్న సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికల విధులపై పలు సూచనలు చేశారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేలా చూడాలన్నారు.


