News March 30, 2024
MLA రాచమల్లు ఒక ముళ్లు: చంద్రబాబు

ప్రొద్దుటూరు బహిరంగ సభలో చంద్రబాబు ఎమ్మెల్యే రాచమల్లుపై విమర్శలు గుప్పించారు. రాచమల్లు ఒక ముళ్లు అని ప్రజలను గుచ్చుతూనే ఉంటారని ఆరోపించారు. ప్రొద్దుటూరులో మట్కా, జూదం, ఇసుక, సెటిల్ మెంట్ లో, నకిలీ నోట్లు ఇలా అన్నింటిలో అవినీతిలో ఉన్నారని అన్నారు. టెక్నాలజీ దుర్మార్గుడి చేతిలో ఉంటే ప్రజలు ఆగం అవుతారన్నారు. రాజమల్లు రూ.2 వేల కోట్లు అవినీతితో సంపాదించారని ఆరోపించారు.
Similar News
News November 17, 2025
19న కడప జిల్లాకు సీఎం చంద్రబాబు..?

సీఎం చంద్రబాబు ఈనెల 19న కడప జిల్లాకు వస్తారని సమాచారం. కమలాపురం నియోజకవర్గ పరిధిలోని పెండ్లిమర్రి మండలంలో ఆయన రైతులతో సమావేశమవుతారు. పీఎం కిసాన్ నిధుల విడుదల తర్వాత క్షేత్రస్థాయిలో పొలాలను పరిశీలిస్తారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నేడు లేదా రేపు అధికారికంగా షెడ్యూల్ రానుంది.
News November 17, 2025
కడప: ‘మహిళలు ఉపాధి శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి’

కడపలోని కెనరా బ్యాంక్ శిక్షణ శిబిరం నందు నిర్వహించే శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి అని సంస్థ డైరెక్టర్ ఆరిఫ్ పేర్కొన్నారు. నవంబర్ 17వ తేదీ నుంచి 45 రోజుల పాటు మహిళలకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు. టైలరింగ్, బ్యూటీ పార్లర్ విభాగాలలో శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు.
News November 16, 2025
కడపలో రైలు ఢీకొని విద్యార్థి మృతి

కడప రైల్వే స్టేషన్లో శనివారం గూడ్స్ రైలు ఢీకొని సతీశ్ (24) అనే బీటెక్ విద్యార్థి మృతి చెందినట్లు కడప రైల్వే SI సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. సతీశ్ పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు వచ్చి ఢీకొట్టడంతో ప్రమాదవశాత్తూ మృతి చెందాడన్నారు. మృతుడు నంద్యాల జిల్లా బనగానపల్లె వాసి అని, కడపలో అన్నమాచార్య కాలేజీలో బీటెక్ చదువుతున్నాడని వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు SI పేర్కొన్నారు.


