News April 14, 2025
MLA సింప్లిసిటీ.. సెలూన్లో సామాన్యుడిలా క్షవరం!

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంత్ రావు తన సింప్లిసిటీతో మరోసారి అందరినీ ఆకట్టుకున్నారు. హైదరాబాద్లో బిచ్కుంద వాసి సురేష్ హెయిర్ సెలూన్కు వెళ్లి సామాన్యుడిలా క్షవరం చేయించుకున్నారు. ఈ సమయంలో ఆయన చుట్టూ ఉన్న వారితో సరదాగా మాట్లాడారు. ఎమ్మెల్యే హోదాలో ఉన్నప్పటికీ, ఆయన ఎంతో నిరాడంబరంగా ఉండటం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన సింప్లిసిటీ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
Similar News
News April 16, 2025
మదనపల్లె: ఉచ్చులో చిక్కుకున్న చిరుత పులి

అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం పొన్నూటి పాలెం వద్ద రైతులు వన్య ప్రాణుల నుంచి పంట రక్షణకు పొలాల చుట్టూ అమర్చిన ఉచ్చులో మంగళవారం రాత్రి ఓ చిరుత పులి చిక్కుకుంది. ఉదయాన్నే గమనించిన రైతులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామానికి సమీపంలోకి చిరుత రావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు భయాందోళన చెందుతున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News April 16, 2025
మహబూబ్ నగర్ జిల్లాలో.. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి తీవ్రత రోజుకు పెరుగుతుంది. గత 24 గంటల్లో కౌకుంట్ల 40.6 డిగ్రీలు, దేవరకద్ర 40.5 డిగ్రీలు, అడ్డాకుల, మిడ్జిల్ మండలం కొత్తపల్లి 40.1 డిగ్రీలు, కోయిలకొండ మండలం పారుపల్లిలో 40.0 డిగ్రీలు, చిన్నచింతకుంట మండలం వడ్డేమాన్ 39.8 డిగ్రీలు, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 39.4 డిగ్రీలు, మూసాపేట మండలం జానంపేట 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
News April 16, 2025
రామడుగు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. రామడుగు మండల కేంద్రంలోని తాటి వనం వద్ద మోచ భూమయ్య మంగళవారం రాత్రి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.